Advertisement
Google Ads BL

హీరోయిన్ అఖిల ఆకర్షణ బర్త్‌డే పోస్టర్ విడుదల


హీరోయిన్ అఖిల ఆకర్షణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్ర యూనిట్!

Advertisement
CJ Advs

హుషారు ఫేమ్ తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా.. కల్పనా రెడ్డి, తనికెళ్ళ భరణి, జీవ, జోగి బ్రదర్స్,  ప్రధాన పాత్రలలో జి.వి.ఆర్ ఫిలిం మేకర్స్ సమర్పణలో, రాజధాని ఆర్ట్ మూవీస్ నిర్మాణంలో ముల్లేటి కమలాక్షి గుబ్బల వేంకటేశ్వర రావు సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ ఆహ్లాదకరమైన గ్రామీణ నేపధ్యంలో తెరకెక్కుతుంది. హీరోయిన్ అఖిల ఆకర్షణ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ అఖిల ఆకర్షణకు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్రంలోని పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. దర్శకుడు ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. సినిమా బాగా వచ్చింది, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఒక లవ్ స్టోరీగా ఈ సినిమా ఉండబోతోందని తెలిపారు.

దర్శకుడు వెంకట్ వందెల మాట్లాడుతూ.. హుషారు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజ్ ఈ సినిమాలో మరో డిఫరెంట్ రోల్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అలాగే హీరోయిన్ అఖిల ఆకర్షణ ఈ సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోబోతోంది. నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా ఎక్కడా కాంప్రమైజ్ కానివ్వకుండా సినిమా తియ్యటానికి పూర్తి సహకారం అందిస్తున్నారు. మనకు తెలీకుండా మనలో ప్రేమ పుట్టినప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది, ఆ ప్రేమ ఒక వ్యక్తి ద్వారా పుట్టిందని తెలిసినప్పుడు ఆ వ్యక్తి కోసం ఎంత దూరమైనా వెళ్లాలనిపిస్తుందనే సస్పెన్స్ క్యూట్ లవ్ స్టొరీ ఇదని తెలిపారు. 

ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు:

నిర్మాతలు: ముల్లేటి కమలాక్షి గుబ్బల వెంకటేశ్వర రావు

కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: వెంకట్ వందెల

సంగీతం: సందీప్ కుమార్

స్క్రీన్‌ప్లే, లిరిక్స్: డాక్టర్ భవ్య దీప్తిరెడ్డి

కెమెరామెన్: వంశీ ప్రకాష్

ఎడిటింగ్: కె. రవికుమార్

కొరియోగ్రాఫర్: గణేష్ స్వామి, నండెపు రమేష్

స్టంట్స్: రామకృష్ణ

చీఫ్ కో డైరెక్టర్: ఎల్. రామకృష్ణం రాజు

పిఆరోఓ: సాయి సతీష్

Heroine Akhila Akarshana Birthday poster released:

GVR Film makers film heroine poster released 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs