Advertisement
Google Ads BL

అఫీషియల్: కొరటాలతోనే అల్లు అర్జున్ 21 చిత్రం!


స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ - డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో మిక్కిలినేని సుధాకర్ నిర్మాతగా యువ సుధ ఆర్ట్స్ - జీఏ2 పిక్చర్స్ #AA21

Advertisement
CJ Advs

‘అల వైకుంఠపురములో’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో సరికొత్త ఇండస్ట్రీ రికార్డ్స్ నెలకొల్పి, అదే ఉత్సాహంతో వరుస సినిమాలతో తన అభిమానులని అలరించడానికి సిద్ధం అవుతున్నారు స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్. ఇప్పటికే స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ అప్ కమింగ్ మూవీ ‘పుష్ప’కి సంబంధించిన వివిధ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో క్రేజీ సినిమాతో ఫ్యాన్స్‌కి స్పెషల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు స్టైలిష్‌స్టార్, వరుస బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న కొరటాల శివతో కలిసి సినిమా చేయబోతున్నారు స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్. యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ పై సుధాకర్ మిక్కిలినేని పాన్ ఇండియా రేంజ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. మరో అగ్ర నిర్మాణ సంస్థ జీఏ 2 పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్‌లో నిర్మాణంలో భాగస్వామిగా ఉండనుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మిత్రులు శాండీ, స్వాతి, నట్టిలు జీఏ 2 పిక్చర్స్ సారథ్యంలో ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు.

స్నేహితులే చిత్ర నిర్మాణ సారధులు  

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌ తన స్నేహితుల్ని, బంధువుల్ని, సన్నిహితులని తన సినిమాల్లో భాగం చేస్తుంటారు. ‘రేసుగుర్రం’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, ‘పుష్ప’ సినిమా నిర్మాణంలోనూ ఆయన బంధువులు భాగం పంచుకున్నారు. మరోసారి అదే తరహాలో తన మిత్రులు శాండీ, స్వాతి, నట్టిలకు ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరించేందుకు అవకాశం ఇచ్చారు. ఇది ఇలా ఉండగా డైరెక్టర్ కొరటాల శివకి సన్నిహితుడు, స్నేహితుడైన మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించడం విశేషం. 

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ - డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌కి ఫుల్ క్రేజ్

అటు డైరెక్టర్ కొరటాల శివ ఇప్పటికే వివిధ స్టార్ హీరోలతో పని చేశారు, ఇటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వివిధ ప్రముఖ దర్శకులతో పని చేశారు. కానీ ఈసారి మాత్రం వీరిద్దరి కాంబినేషన్ సెట్ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ పై అటు స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ అభిమానుల్లో, ఇటు సాధారణ ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

బ్యానర్: యువ సుధ ఆర్ట్స్ - జీఏ2 పిక్చర్స్ 

నిర్మాత: సుధాకర్ మిక్కిలినేని 

సహ నిర్మాతలు: సాండీ, స్వాతి, నట్టి

Allu Arjun 21 Film in Koratala Siva Direction:

Allu Arjun 21 Film Official announcement Out
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs