Advertisement
Google Ads BL

ప్రేమ పిపాసి తో రెండేళ్లు జర్ని చేశా!


 ఎలాంటి సినిమా నేపథ్యం , వారసత్వం లేకున్నా కేవలం సినిమా హీరో అవ్వాలన్న కోరికతో చిత్ర పరిశ్రమలోకి వచ్చి... ఎన్నో సాధక బాధకాలు అనుభవించి  ప్రేమ పిపాసి తో హీరో అవ్వాలన్న కోరిక నెరవేర్చుకుంటున్నాడు హీరో జిపిఎస్.  మురళి రామస్వామి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని పియస్‌ రామకృష్ణ, రాహుల్‌ పండిట్‌, యుగంధర్‌, వైజాగ్ మురళి  సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం రేపు శుక్రవారం విడుదవుతోన్న సందర్భంగా హీరో జిపియస్‌ www.cinejosh.com తో మాట్లాడారు. ఆ విశేషాలు. 

Advertisement
CJ Advs

సినిమా ఇండస్ట్రీ పై ఆసక్తి ఎలా కలిగింది?

 నాకు ఎలాంటి సినిమా నేపథ్యం లేదు. ఉన్నదల్లా సినిమాల పై చిన్నప్పటి నుంచి ఉన్న ఆసక్తి.  మెగాస్టార్‌ చిరంజీవి గారికి వీరాభిమానిని. ఆయన సినిమాలు  క్రమం తప్పకుండా చూసేవాణ్ని. అలా సినిమాల పై ఆసక్తి ఇంకా ఎక్కువైంది. ఇక నా స్టడి పూర్తయ్యాక తేజగారు కొత్త వారికి అవకాశాలు  ఇస్తోన్న క్రమంలో హైదరాబాదుకి  వచ్చాను. తేజ గారి దగ్గర ప్రయత్నించా కానీ వర్కవుట్‌ కాలేదు. ఈ క్రమంలో ఎలాగైనా సినిమా ఫీల్డ్‌లోనే ఉండిపోవాలని...అప్పట్లో ఒక హీరో ఇంటర్వ్యూ చదివి...ఆ ఇన్‌స్పిరేషన్‌తో దర్శకత్వ శాఖలో కొన్ని సినిమాలకు, యాడ్ ఫిలిమ్స్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా  కొంతకాలం పని చేశాను. అలాగే రైటర్‌ కులశేఖర్‌ గారి వద్ద కొంతకాలం వర్క్‌ చేశా. అలా సినిమా వాళ్ళతో పరిచయాలు  పెరిగాయి. ఈ క్రమంలో సెంట్రల్‌ యూనివర్సిటీలో థియేటర్‌ ఆర్ట్స్‌ లో సీటొచ్చింది. అక్కడే నేను యాక్టింగ్‌లో మెళకువలు  నేర్చుకున్నా. 

 నటుడుగా మీ తొలి సినిమా??

 నేనొస్తా అనే సినిమాలో నేను నెగిటివ్‌ పాత్రలో నటించాను. అందులో నా పాత్రకు మంచి పేరొచ్చింది. రివ్యూస్‌లో  నా నటన గురించి ప్రత్యేకంగా రాశారు. ఆ తర్వాత నాలో కాన్ఫిడెన్స్ వచ్చింది. మెల్ల మెల్లగా కొన్ని చిత్రాల్లో  అవకాశాలు  వచ్చాయి. కానీ హీరో అవ్వాలన్నది నా మెయిన్ టార్గెట్‌ కాబట్టి, ఆ దిశగా ప్రయత్నాలు  ప్రారంభించడం జరిగింది. 

ప్రేమ పిపాసి చిత్రంలో నటించే అవకాశం ఎలా లభించింది??

 ఈ చిత్ర దర్శకుడు మురళి రామస్వామితో నేను మొదటి నుంచి మంచి మిత్రులం.  హీరో అవ్వాలన్నది  నా కోరికైతే, మంచి దర్శకుడు అవ్వాలన్నది  ఆయన కోరిక. ఒక రోజు ప్రేమ పిపాసి స్టోరి వినిపించాడు. నాకు చాలా నచ్చింది. కానీ ప్రొడ్యూసర్‌ ఎలా? అంటూ సెర్చింగ్‌ ప్రారంభించాం. చాలా మందిని కలిశాం. పియస్‌ రామకృష్ణగారు ఫ్రెండ్‌ ద్వారా పరిచయమయ్యారు. అలాగే యుగంధర్‌ గారు, రాహుల్‌ భాయ్‌, వైజాగ్‌ మురళి సినిమాకు తోడయ్యారు. నన్ను, డైరక్టర్‌ని మా కసిని నమ్మి  కొత్త టాలెంట్ ని ప్రోత్సహించాలని  మా నిర్మాతలు  ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమా నిర్మించారు. ప్రేమ పిపాసితో రెండేళ్లు జర్ని చేశాం. 

ప్రేమ పిపాసి లో మీకు నచ్చిన అంశాలు ఏంటి??

 ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం స్టోరి. రెగ్యులర్  స్టోరీలా కాకుండా డిఫరెంట్‌గా ఉంటుంది. సినిమా మొత్తం నా క్యారక్టర్‌ చుట్టూ తిరుగుతుంది. మూడు వెరీయేషన్స్ ఉన్న పాత్ర చేసాను.   ఒక్క మాటలో చెప్పాలంటే  వన్‌మేన్‌ ఆర్మీలా  నా పాత్ర ఉంటుంది. అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాడు. ప్రేమను వెతుక్కుంటూ ఉంటాడు. చివరికి అప్రేమ ఎలా దొరికింది. అతను అనుకున్నది ఎలా సాధించాడు అనేది ముఖ్య కథాంశం.  

ఈ సినిమా ఏ జోనర్లో ఉంటుంది?

 ఇక ఇందులో ఎక్‌స్ట్రీమ్‌ లవ్‌, ఎక్‌స్ట్రీమ్‌ ఎమోషన్‌, ఎక్‌స్ట్రీమ్‌ రొమాన్స్‌, ఎక్‌స్ట్రీమ్‌ ఫ్రస్టేషన్‌ ఇలా ప్రతిదీ ఎక్‌స్ట్రీమ్‌లో ఉంటుంది. ప్రజంట్‌ ట్రెండ్‌కి అడ్వాన్స్‌డ్‌గా సినిమా ఉంటుంది. ఇక లిప్ లాక్స్  అంటే కంటెంటు లాక్స్ లా ఉంటుంది తప్ప ఎదో పెట్టాలని పెట్టలేదు. నలుగురు అమ్మాయిలతో 12 లిప్ లాక్ సీన్స్ ఉంటాయి. అవి కథలో భాగంగా ఉంటాయి.  సినిమా చూసాక మీరు కూడా ఒప్పుకుంటారు. 

 దర్శక నిర్మాత గురించి చెప్పండి??

 దర్శకుడు నా ఫ్రెండ్‌ కావడంతో మంచి ఫ్రీడమ్‌ ఇచ్చాడు. అందులో నా ఐడియాలజీ, తన ఐడియాలజీ దగ్గరగా ఉంటాయి. ఇద్దరికీ బాగా సింక్‌ అయింది. హీరోకి, డైరక్టర్‌కి సింక్‌ అయితే అవుట్‌ పుట్‌ బాగొస్తుంది. ఇక తను స్పీడ్‌ మేకర్‌. చాలా డెడికేటెడ్‌గా వర్క్‌ చేస్తాడు. కొత్తగా ఆలోచిస్తాడు. ఇక మా నిర్మాతలు  లేకుంటే ఈ సినిమా లేదు. ఇప్పుడు ఎవరు డబ్బు పెడితే వారే హీరో అన్నట్టుంది. ఈ క్రమంలో   హీరోగా నాతో సినిమా  చేయాల్సిన పనిలేదు. కానీ నన్ను, మా డైరెక్టర్ కసిని  నమ్మి ఇంత డబ్బు పెట్టారు. కచ్చితంగా వారికి రుణపడి ఉంటాను. మా టీమ్‌ అంతా కలిసి మరో సినిమా ప్లాన్‌ చేస్తున్నాం. 

 సినిమాకు హైలెట్స్‌??

 తిరుమల  మ్యూజిక్‌ సినిమాటోగ్రఫీ , ఆర్స్‌ మ్యూజిక్‌, స్టోరి, డైరక్షన్‌ ఎడిటింగ్‌ సినిమాకు ప్రధాన ఆకర్షణలు.  ఇప్పటికే విడుదలైన పాటలకు, టీజర్‌కు మంచి వ్యూస్‌తో పాటు రెస్పాన్స్‌ వచ్చింది. ఇందులో నలుగురు  హీరోయిన్స్‌ ఉన్నారు. అందరి పాత్రలు  డిఫరెంట్‌గా ఉంటాయి. 

 మీకు ఇన్‌స్పిరేషన్‌ ఎవరు? ఏ డైరక్టర్‌తో వర్క్‌ చేయాలని ఉంది??

 నాకు మెగాస్టార్‌ చిరంజీవిగారు, తమిళ హీరో సూర్యగారు అంటే చాలా ఇష్టం. వీరు నా అభిమాన హీరోలు . ఇక నేను తేజ గారికి ఏకలవ్య  శిష్యుణ్ని. ఆయన ఇంటర్వ్యూ లు  ఎక్కువగా చూస్తాను. ఆయన్ను ఫాలో అవుతుంటాను. ఎప్పటికైనా ఆయన డైరక్షన్‌లో సినిమా చేయాలన్నది  నా కోరిక. కొత్త కాన్సెప్ట్‌తో సినిమాలు  చేస్తాను. ఇక ఇప్పటి కాంపిటీషన్‌ తట్టుకోవడానికి హార్డ్‌ వర్క్‌ చేస్తూ ముందుకెళతాను. ఎప్పటికప్పుడు నన్ను నేను ఇంప్రూవ్‌ చేసుకుంటుటాను. మంచి నటుడుగా ప్రేమ పిపాసి సినిమా పేరు తెస్తుందన్న నమ్మకం ఉంది. నా ఫ్యామిలీ పూర్తి సహకారం వల్లే నేను సినీ పరిశ్రమలో ఉండగులుగుతున్నా. ప్రస్తుతం రెండు చిత్రాలకు సంబంధించి చర్చలు  జరుగుతున్నాయి. ఆ వివరాలు త్వరలో తెలియజేస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు హీరో జెపియస్.

Two years journey with Prema pipasi!:

<pre id="tw-target-text" class="tw-data-text tw-text-large tw-ta" dir="ltr"><span lang="en">The love story in Peaks is our love pipasi - Hero JPS</span></pre>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs