ఎలా ప్రేమించ కూడదు అనేది ప్రేమ పిపాసి
> ప్రేమ పిపాసి ఈ నెల 13న విడుదల
జీపీయస్, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షీ వర్మ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం
ప్రేమ పిపాసి. ఎస్.ఎస్. ఆర్ట్ ప్రొడక్షన్స్, యుగ క్రియేషన్స్ పతాకాలపై రాహుల్ భాయ్ మీడియా, దుర్గశ్రీ ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రానికి పి.ఎస్ రామకృష్ణ (ఆర్.కె) నిర్మాత. మురళీ రామస్వామి (యం.ఆర్) దర్శకుడు. ఈ నెల 13న సినిమా రిలీజ్ కాబోతున్న సందర్భంగా మంగళవారం ప్రసాద్ లాబ్స్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత పిఎస్ రామకృష్ణ మాట్లాడుతూ... డైరెక్టర్ మురళి రామస్వామి, హీరో జిపిఎస్ మంచి స్టోరీ తో నన్ను కలిశారు. స్టోరీ నచ్చి రియల్ ఎస్టేట్ లో ఉన్న నేను మరో ముగ్గురు మిత్రులతో కలిసి ఈ సినిమా నిర్మించాను. మా డైరెక్టర్ అనుకున్నదానికన్నా చాలా బాగా తీసాడు. ఈ సినిమాతో డైరెక్టర్, హీరో కి మిగతా వారందరికీ మంచి పేరొస్తుంది. మా సినిమాను అర్జున్ రెడ్డి , ఆర్ ఎక్స్ 100 సినిమాలతో పోలుస్తున్నారు. అలాంటి సక్సెస్ ఫుల్ సినిమాలతో పోల్చడం మంచిదే. కానీ మొదట ఆర్ ఎక్స్ 100 సినిమాను కూడా అర్జున్ రెడ్డి తో పోల్చారు. అయినా ఆర్ ఎక్స్ 100 సినిమా దానికంటూ మంచి మార్క్ క్రియేట్ చేసుకుంది. అలాగే ఈ నెల 13న విదులయ్యే మా సినిమా కూడా న్యూ ట్రెండ్ ని సృష్టిస్తుంది. ఇక పై వచ్చే సినిమాలను ప్రేమ పిపాసి ల ఉందంటారు అన్నారు.
డైరెక్టర్ మురళి రామస్వామి మాట్లాడుతూ ... రెండేళ్ల జర్నీఈ సినిమా. హీరో జిపిఎస్ నాకు మంచి మిత్రుడు. ఈ సినిమా కోసం అతన్ని చాలా రఫ్ గా తయారు చేశాను. సినిమాను తన నటనతో నిలబెట్టాడు. మా నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు. రిలీజ్ , పబ్లిసిటీ కూడా చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. ఆర్స్ మ్యూజిక్, తిరుమల సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఇలా నా టెక్నిషన్స్ టీమ్ ఎంతో ఎఫర్ట్ పెట్టారు. అందుకే సినిమాను అనుకున్న విధంగా తీయగలిగాను. జెన్యూన్ లవ్ అంటే ఎలా ఉంటుంది. ఎలా ప్రేమించాలి , ఎలా ప్రేమించ కూడదు అనేది మా సినిమాలో చూపించాం అన్నారు.
హీరో జిపిఎస్ మాట్లాడుతూ... ఈ సినిమా కోసం టీం అంతా ఎంతో హార్డ్ వర్క్ చేసింది. మా నిర్మాత చెప్పినట్టు అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100 సినిమాలతో మా సినిమాను పోలుస్తున్నారు. కానీ మా సినిమాకు వాటికి సంబంధం లేదు. కచ్చితం గా మా సినిమా మరో ట్రెండ్ సృష్టిస్తుంది. ఇక ప్రెస్ మీట్స్ లో ఆ హీరోలా ఈ హీరో లా మాట్లాడు అంటూ మా ఫ్రెండ్స్ ఫోర్స్ చేసారు...నాకు మాత్రం ఇష్టం లేదు. 13 న రిలీజ్ అయ్యాక మా సినిమానే మాట్లాడుతుంది అన్నారు.
మరో నిర్మాత రాహుల్ భాయ్ మాట్లాడుతూ... డైరెక్టర్, హీరో చాలా రెదను కళ్లలా సినిమాకు వర్క్ చేసారు. సాంగ్స్, క్లయిమాక్ ,సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్స్ అన్నారు.
లిరిసిస్ట్ సురేష్ గంగుల మాట్లాడుతూ... మురళి రామ స్వామి క్లారిటీ ఉన్న డైరెక్టర్. ప్రతి పాట దగ్గరుండి రాయించుకున్నారు. ఇందులో టీజింగ్, లవ్, రొమాన్స్ , హీరో ఇంట్రడక్షన్ ఇలా నాలుగు పాటలు రాసాను. ఇప్పటికే సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమాకి కూడా అదే రెస్పాన్స్ వస్తుందన్న నమ్మకం ఉంది. సినిమా ఫస్ట్ కాపీ చుసాను.. హీరో జిపిఎస్ గారి నాట విశ్వరూపం చూస్తారు. డైరెక్టర్ టాలెంట్ ప్రూవ్ చేసే సినిమా అవుతుంది``అన్నారు.
మరో లిరిసిస్ట్ అలా రాజు మాట్లాడుతూ... ఇందులో `ఐ ఫోన్ లాంటి పిల్లంటూ` ...అనే ఐటెం సాంగ్ రాసాను. మంచి రెస్పాన్స్ వచ్చింది పాటకి. డైరెక్టర్ మురళి గారు నాతో ట్రెండీ లిరిక్స్ రాయించారు అన్నారు.
హీరోయిన్స్ మాట్లాడుతూ... ఒక మంచి సినిమాలో పార్ట్ అయినందుకు హ్యాపీ గా ఉందన్నారు.
ప్రొడక్షన్ డిజైనర్ పండు మాట్లాడుతూ... మా టీం అంతా సహకరించడం తో ఒక మంచి సినిమా చేసాం అన్నారు.
Advertisement
CJ Advs
Prema Pipasi is released on the 13th of March:
<pre id="tw-target-text" class="tw-data-text tw-text-large tw-ta" dir="ltr"><span lang="en">How not to love is Prema Pipasi</span></pre>
Show comments
Advertisement
Google Ad amp 3
CJ Ads
Advertisement
Google Ad amp 3
CJ Ads