Advertisement
Google Ads BL

ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?


>మార్చ్ 25న వస్తోన్న  ముప్పైరోజుల్లో ప్రేమించడం ఎలా?
యాంకర్ ప్రదీప్ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా మున్నా దర్శకత్వంలో యస్. వి.బాబు నిర్మించిన ముప్పైరోజుల్లో ప్రేమించడం ఎలా? చిత్రం మార్చ్ 25న విడుదలవుతుంది. ఈ సందర్బంగా  చిత్ర యూనిట్ ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో .. 
కో-ప్రొడ్యూసర్ వినయ్ మాట్లాడుతూ.. ముప్పైరోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రం మార్చ్ 25న విడుదలవుతుంది. ఇప్పటికే విడుదలైన పాటలు మంచి హిట్ అయ్యాయి. అలాగే సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాము. ఈ సినిమాకి పనిచేసిన నటీ,నటులకు నా థాంక్స్ అన్నారు. 
హీరోయిన్ అమృత అయ్యర్ మాట్లాడుతూ ..   ఇది నా ఫస్ట్ మూవీ. ఇలాంటి మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్ మున్నాకి థాంక్స్. మార్చ్ 25న మా సినిమా విడులవుతుంది. అందరూ సినిమా  చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను.. అన్నారు. 
నిర్మాత యస్.వి. బాబు మాట్లాడుతూ.. నీలి నీలి పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అనూప్ వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. అలాగే చంద్రబోస్ మంచి సాహిత్యాన్ని అందించారు.  బన్నీ వాసు సినిమా చూశారు. ఆయనకి బాగా నచ్చి జిఎ2 బ్యానర్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. బన్నీ వాసుకి నా థాంక్స్... అన్నారు. 
దర్శకుడు మున్నా మాట్లాడుతూ.. యం సి ఏ చదివే రోజుల్లో సుకుమార్ వద్ద పనిచేయాలను గట్టిగా అనుకున్నాను. అలాగే సుకుమార్ గారి వద్ద అసిస్టెంట్ గావర్క్ చేశాను. ఈ కథ అల్లు అర్జున్ గారికి, బన్నీ వాసుకి  చెప్పాను. ఆయన బాగా ఎంజాయ్ చేస్తూ కొన్ని సజేషన్స్ ఇచ్చారు. ఆయన చెప్పినట్టు చేశాం. సెన్సార్ వారు సినిమా చూసి అప్రిషియేట్ చేశారు. అలాగే బన్నీ వాసు సినిమా చూసి జీఎ2 ద్వారా రిలీజ్ చేస్తున్నారు. వారికి నా థాంక్స్. ఈ చిత్రంలోని కొన్ని ఎమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. 2020లో ఒక గుర్తుండిపోయే సినిమా అవుతుంది.. అన్నారు. 
సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. మంచి సాంగ్స్ చేయడానికి స్విచ్యువేషన్ చెప్పి మంచి ట్యూన్స్ రాబట్టుకున్నారు మున్నా. మ్యూజిక్ హిట్ అయింది. నిర్మాత బాబు గారు ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు.. అన్నారు. 
ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ.. నీలి నీలి పాటకు 70మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్స్, దర్శక నిర్మాతలందరు సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకి వర్క్ చేసిన అందరికి థాంక్స్.. అన్నారు.

Advertisement
CJ Advs

How to love Pradeep in 30 days?:

30 rojullo preminchadam ela?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs