Advertisement
Google Ads BL

ఈ సినిమా కోసం శ్రీకాంత్ ప్రాణం పెట్టేశాడట!


 షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘మార్షల్’ 

Advertisement
CJ Advs

పబ్లిక్ స్టార్ శ్రీకాంత్ విభిన్న పాత్ర పోషిస్తుండగా అభయ్ హీరోగా  పరిచయమవుతోన్న చిత్రం ‘మార్షల్’. ఏ వి ఎల్  ప్రొడక్షన్స్ పతాకంపై జై రాజసింగ్ దర్శకత్వంలో అభయ్ అడకా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేఘా చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని.. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు సిద్ధమవుతుంది. 

దర్శకుడు జై రాజసింగ్ మాట్లాడుతూ.. 2019 లో విభిన్నంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా ‘మార్షల్’. మంగళవారం ‘మార్షల్’ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన సందర్భంగా సినిమా అన్ని తరహాల వారికి నచ్చేలా ఉంటుందని.  హీరో అభయ్ అడకా పాత్ర ఎంతో హుందాగా, నూతనంగా ఉంటుందని వివరించారు. సినీ హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో ఒక మరచిపోలేని పాత్రకు ప్రాణం పోశారని చెప్పారు. ఆర్.యం.స్వామి  సినిమాటోగ్రఫీ, సంగీతం, యాదగిరి వరికుప్పల, ఫైట్స్, నాభ మరియు సుబ్బు, ఎసెట్స్ గా నిలుస్తాయి. నిర్మాత ఈ సినిమా ప్రారంభం నుంచి మాకు ఎంతో సపోర్ట్ చేస్తూ వచ్చారు. షూటింగ్  కార్యక్రమాలు ముగిశాయి. త్వరలోనే సినిమా పోస్టు ప్రొడక్షన్ కి వెళ్లనుందన్నారు.

నిర్మాత అభయ్ అడకా మాట్లాడుతూ..  వైవిద్యభరితమైన చిత్రం ‘మార్షల్’ మంచి మెసేజ్ ఉన్న సినిమా చేశాం.. ఇది అందరికీ నచ్చుతుంది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకువస్తామన్నారు.

శ్రీకాంత్,  అభయ్, మేఘా చౌదరి, రష్మి సమాంగ్, సుమన్, వినోద్ కుమార్, శరణ్య, పృద్విరాజ్, రవి ప్రకాష్, ప్రియ దర్శిని రామ్, ప్రగతి, కల్ప వల్లి, సుదర్శన్, తదితరులు నటించిన.. ఈ చిత్రానికి 

సంగీతం: యాదగిరి వరికుప్పల 

ఛాయాగ్రాహకుడు : స్వామి ఆర్ యమ్

మాటలు : ప్రవీణ్ కుమార్ బొట్ల 

ఫైట్స్ : నాభ మరియు సుబ్బు

ఎడిటర్ : చోట కె ప్రసాద్

పాటలు : యాదగిరి వరికుప్పల

కళా దర్శకుడు : రఘు కులకర్ణి

డాన్స్ మాస్టర్ : గణేష్ 

ప్రోడక్షన్ కంట్రోలర్ : చిన్న రావు ధవళ

నిర్మాత : అభయ్ అడకా

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : జై రాజ సింగ్.

Marshal Movie 1st Look Released:

Srikanth in Marshal Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs