Advertisement
Google Ads BL

నాని కూడా ఫుల్‌ టైంకి మారబోతున్నాడు


ఒక హీరోకి స్టార్‌ స్టేటస్‌ వచ్చిందంటే తన క్రేజ్‌, ఇమేజ్‌లను ఇతర నిర్మాతలకు ఇవ్వడం దేనికి అనే ఆలోచన పుడుతుంది. సో.. ఇలా స్టార్‌ హీరోల నుంచి చిన్నచితక హీరోల వరకు తామే నిర్మాతలుగా మారుతున్నారు. దర్శకులు కూడా తమ బ్రాండ్‌ నేమ్‌తో తమ శిష్యులు, ఇతరులతో నిర్మాతలుగా మారుతున్నారు. ఇక స్టార్‌ హీరోల విషయానికి వస్తే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌, అల్లుఅర్జున్‌, రామ్‌చరణ్‌, మహేష్‌బాబు... ఇలా అందరికీ నిర్మాణ సంస్థలు ఉన్నాయి. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా జూనియర్‌ ఎన్టీఆర్‌కి అన్నయ్య కళ్యాణ్‌రామ్‌ రూపంలో తోడు లభించింది. ఇంతకాలం నిర్మాణం జోలికి వెళ్లని బాలయ్య సైతం నిర్మాతగా మారాడు. ఇక వరుణ్‌సందేశ్‌ నుంచి సందీప్‌కిషన్‌ వరకు రామ్‌ నుంచి నితిన్‌ వరకు ఇదే కోవ. ఇక నాని విషయానికి వస్తే ఈయన గతంలో ‘డి ఫర్‌ దోపిడీ’ అనే చిత్రానికి చివరి క్షణాలలో నిర్మాణభాగస్వామిగా చేరాడు. అది డిజాస్టర్‌ అయింది. తాజాగా ‘అ!’ అనే చిత్రానికి కేవలం నిర్మాతగా వ్యవహరించి తన అభిరుచి చాటుకున్నాడు. ఇక ఈయన తన నిర్మాణ కార్యక్రమాల జోరును మరింత పెంచనున్నాడట. అంతేకాదు.. తానే నిర్మాతగా ఇతర టాప్‌ ప్రోడ్యూసర్ల భాగస్వామ్యంలో నిర్మించే చిత్రాలలో తానే హీరోగా నటించనున్నాడని తెలుస్తోంది. 

ఇప్పటికే దిల్‌రాజు వంటి వారిని ఈ విషయంలో లైన్‌లో పెట్టాడట. నాని భాగస్వామ్యంలో ఆయనే హీరోగా రెండు చిత్రాలు నిర్మితం కానున్నాయి. ఇందులో ఒక చిత్రానికి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకుడు. మరో చిత్రానికి డైరెక్టర్‌, నిర్మాణ భాగస్వామిపై త్వరలో క్లారిటీ రానుంది. ప్రస్తుతం నాని ‘మళ్లీరావా’ దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరు దర్శకత్వంలో ‘జెర్సీ’ అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు. దీని వెంటనే ఇంటెలిజెంట్‌ డైరెక్టర్‌గా పేరున్న విక్రమ్‌ కె.కుమార్‌ చిత్రం ప్రారంభం అవుతుంది.

Nani Planning for 2 More Movies:

<span>2 Movies From Nani production House</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs