Advertisement
Google Ads BL

20మినిట్స్- ‘అంతకు మించి’.. ట్రై చేశారు


అంతకు మించి టైటిల్ లిరికల్ సాంగ్ విడుదల కార్యక్రమం

Advertisement
CJ Advs

ఎస్ జై ఫిలిమ్స్ పతాకంపై యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పించు చిత్రం ‘అంతకు మించి’. జై ,రష్మీ గౌతమ్ జంటగా జానీ డైరెక్టర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్ర  టైటిల్ లిరికల్ సాంగ్ ను సోమవారం ఉదయం విడుదల చేశారు. 

ఈ సందర్భంగా డైరెక్టర్ జానీ మాట్లాడుతూ.. సినిమాలో రష్మి పెర్ఫామెన్స్ గురించే మాట్లాడుతారు అంతా. 2 వెరీయేషన్స్ ఉన్న పాత్రలో నటిస్తోంది తను.  కొత్త హీరో ఎవరైనా ఫైట్స్ పెట్టు, డాన్సులు పెట్టు అనేలాంటి ఆఫర్స్ కోరతారు. కానీ జై మాత్రం పెర్ఫామెన్స్ ఉన్న పాత్రను డిజైన్ చేయమని కోరాడు..చాలా కష్టపడి కొత్తగా ప్రయత్నిచాడు. సైలెన్స్ హారర్ ప్రయారిటీ ఉన్న ఈ సినిమాకు అందుకు తగ్గట్టే మ్యూజిక్‌ను, ఆర్‌ఆర్‌ను అందించాడు మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్. ఇక ఈ సినిమాలో మరో విశేషం ఏమిటంటే... సినిమా స్టార్టింగ్ 20మినిట్స్ జరిగే సీన్స్‌లో ఒక్క డైలాగ్ కూడా లేకుండా క్యారీ అవుతుంది. ఈ నెల 24న సినిమా విడుదలవుతుంది తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను.. అన్నారు. 

హీరో జై మాట్లాడుతూ.. నైజాంలో ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ 100 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. రష్మీ మేజర్ ఈ సినిమాకు. పక్కా హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నాము.. అని అన్నారు. 

రష్మీ మాట్లాడుతూ... ట్రెండీగా డైరెక్ట్ చేశాడు డైరెక్టర్. సినిమా కేక్ అయితే ఈ రోజు విడుదల చేసిన టైటిల్ లిరికల్ సాంగ్ క్రీమ్ అని చెప్పొచ్చు. ఎంతో ఎఫర్ట్ పెట్టి పనిచేశారు అందరూ. అందరికీ అంతకు మించి సినిమా నచ్చుతుందని భావిస్తున్నాను.. అన్నారు. 

ఈ కార్యక్రమంలో రైటర్ మోహన్, పురుషోత్తం (సౌండ్ ఎఫెక్ట్స్), నటులు రింగ్ మణి, రాజ్ పాల్, హర్ష, ప్రసాద్, కర్ణ(ఎడిటర్), వంశీ తదితరులు పాల్గొన్నారు.

Anthaku Minchi Title Lyrical Song Launched:

Anthaku Minchi Movie Press Meet Highlights 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs