Advertisement
Google Ads BL

‘సుబ్రహ్మణ్యపురం’ సెన్సేషన్ మొదలైంది


నిర్మాణంలో ఉండగానే అందరి దృష్టిని ఆకర్షిస్తూ.. అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తున్న హీరో సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. ఈ చిత్ర ఓవర్సీస్ హక్కులు ఫ్యాన్సీ రేటుతో కంట్రీసైడ్ పిక్చర్స్ అధినేతలు దక్కించుకున్నారు. ఇప్పటి వరకు సుమంత్ కెరీర్‌లో ఓవర్సీస్ హక్కులకు లభించని ఫ్యాన్సీ అమౌంట్ ఈ చిత్రానికి దక్కడం విశేషం. సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రై. లిమిటెడ్ పతాకంపై బీరం సుధాకర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈషా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సూపర్ న్యాచురల్ అంశాల మేళవింపుతో సాగే మిస్టరీ థ్రిల్లర్ చిత్రమిది. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ ప్రేక్షకులకు కలిగిస్తుంది. అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో 30 నిమిషాల పాటు ఉండే గ్రాఫిక్స్ ప్రేక్షకులకు థ్రిల్‌ను కలిగిస్తాయి. తెలుగులో బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచిన బాహుబలి, గరుడవేగ, రంగస్థలం చిత్రాలకు పనిచేసిన వీఎఫ్‌ఎక్స్ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. సుమంత్ కెరీర్‌లో ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా ఫ్యాన్సీ రేటుకు ఓవర్సీస్ హక్కులు అమ్ముడుపోయాయి. తప్పకుండా చిత్రం అందర్నీ అలరిస్తుందనే నమ్మకం ఉంది..అని అన్నారు.

Fancy Rate To SubrahmanyaPuram Overseas Rights:

Sumanth SubrahmanyaPuram sensation Starts
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs