Advertisement
Google Ads BL

'పైసా పరమాత్మ'.. అంతేగా మరి..!!


'పైసా పరమాత్మ' టైటిల్‌తో పాటు మోషన్‌ పోస్టర్‌ చాలా ఇంప్రెసివ్‌గా వుంది- ప్రముఖ నిర్మాత రాజ్‌ కందుకూరి 

Advertisement
CJ Advs

కొత్తదనం ఉంటే ప్రేక్షకులు ఎలాంటి చిత్రాన్నైనా ఆదరిస్తారని లేటెస్ట్‌గా 'గూఢచారి' చిత్రంతో మరోసారి రుజువు చేశారు. స్టార్స్‌ లేకపోయినా పర్వాలేదు, కంటెంట్‌ ఉంటే చాలు ఆడియెన్స్‌ ఆ చిత్రాలకు పట్టం కడతారని 'పెళ్లిచూపులు, అర్జున్‌ రెడ్డి', రీసెంట్‌గా 'ఆర్‌.ఎక్స్‌ 100' చిత్రాలు ప్రూవ్‌ చేశాయి. ఆ చిత్రాలు సెన్సేషనల్‌ హిట్‌ సాధించి సరికొత్త ట్రెండ్‌ని సృష్టించాయి. తాజాగా కంటెంట్‌ బేస్డ్‌తో 'పైసా పరమాత్మ' చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నూతన నటీనటులు సంకేత్‌, సుధీర్‌, క్రిష్ణతేజ, రమణ, అనూష, ఆరోహి నాయుడు, బనీష, ప్రధాన పాత్ర దారులుగా లక్ష్మీ సుచిత్ర క్రియేషన్స్‌ బ్యానర్‌ పై విజయ్‌ కిరణ్‌ దర్శకుడిగా విజయ్‌ జగత్‌ నిర్మిస్తోన్న డిఫరెంట్‌ కథా చిత్రం 'పైసా పరమాత్మ'. ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్‌కి రెడీ అవుతోంది. కాగా ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని బోనాల పండుగ సందర్బంగా ప్రముఖ నిర్మాత రాజ్‌ కందుకూరి తన ఆఫీస్‌లో రిలీజ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు విజయ్‌ కిరణ్‌, సంగీత దర్శకుడు కనిష్క, సంకేత్‌, కృష్ణ తేజ, రమణ, ఆరోహి నాయుడు.. పాల్గొన్నారు. 

ప్రముఖ నిర్మాత రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ.. ఈ సినిమా కాన్సెప్ట్‌ దర్శకుడు విజయ్‌ కిరణ్‌ చెప్పారు. చాలా కొత్తగా వుంది. అందరూ కొత్త వాళ్ళు ఈ చిత్రంలో నటించారు. టైటిల్‌ చాలా ఇంప్రెస్‌గా వుంది. పోస్టర్‌ చాలా బాగుంది. ఇలాంటి టాలెంట్‌ వున్న వారు కొత్త కాన్సెప్ట్‌లతో ముందుకు రావాలి. కొత్త కంటెంట్‌తో డిఫరెంట్‌గా తీస్తే ఆడియెన్స్‌ ఆదరిస్తున్నారు. అది రీసెంట్‌గా 'గూఢచారి'తో మరోసారి ప్రూవ్‌ అయ్యింది. విజయ్‌ కిరణ్‌ షార్ట్‌ ఫిలిమ్స్‌ కొన్ని తీసి, ఫస్ట్‌ టైం ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా మంచి హిట్‌ అయి దర్శకుడిగా విజయ్‌ కిరణ్‌కి మంచి బ్రేక్‌ రావాలని కోరుకుంటున్నాను.. అన్నారు. 

దర్శకుడు విజయ్‌ కిరణ్‌ మాట్లాడుతూ.. కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేయడంలో రాజ్‌ కందుకూరిగారు ఎప్పుడూ ముందుంటారు. మేము అడగ్గానే వెంటనే స్పందించి మా చిత్రం మోషన్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేసిన రాజ్‌ కందుకూరిగారికి మా థ్యాంక్స్. ఈజీ మనీ కోసం దొంగతనాలు, మోసాలు చేస్తోన్న ఓ నలుగురు కుర్రాళ్లు, ఇద్దరు యువతలు అనుకోకుండా ఓ ప్రాబ్లమ్‌లో ఇరుక్కుంటారు. ఆ తర్వాత వాళ్ళు ఆ ప్రాబ్లమ్‌ నుండి బయట పడ్డారా లేదా? అనేది ముఖ్య కథాంశం. ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు సస్పెన్స్‌, థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించాం. కంటెంట్‌ని నమ్మి మా నిర్మాత విజయ్‌ జగత్‌ ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. జి.యల్‌. బాబు కెమెరా వర్క్‌, కనిష్క మ్యూజిక్‌ ఈ చిత్రానికి స్పెషల్‌ ఎస్సెట్‌గా నిలుస్తాయి. కనిష్క మూడు పాటలు ఫెంటాస్టిక్‌గా చేశారు. అలాగే తన రీ-రికార్డింగ్‌తో సినిమాని నెక్స్ట్‌ లెవల్‌కి తీసుకెళ్లాడు. తప్పకుండా 'పైసా పరమాత్మ' చిత్రం ఆడియెన్స్‌కి ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ని కలిగిస్తుంది. అలాగే డిస్ట్రిబ్యూటర్స్‌కి, బయ్యర్స్‌కి పైసా వసూల్‌ చేసే చిత్రం అవుతుందని చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాం.. అన్నారు. 

సంగీత దర్శకుడు కనిష్క మాట్లాడుతూ - ఈ చిత్రంలో మూడు పాటలు ఉన్నాయి. ప్రతి పాట సిట్చ్యుయేషన్‌కి తగ్గట్లుగా వుంటుంది. ఇప్పటి వరకూ రాని ఓ కొత్త పాయింట్‌తో విజయ్‌ కిరణ్‌ 'పైసా పరమాత్మ' చిత్రాన్ని రూపొందించారు. డెఫినెట్‌గా ఈ చిత్రం మంచి హిట్‌ అవుతుంది.. అన్నారు. 

నటుడు కృష్ణతేజ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో పోలీస్‌ ఆఫీసర్‌గా మెయిన్‌ లీడ్‌ క్యారెక్టర్‌లో నటించాను. డైరెక్టర్‌ విజయ్‌ కిరణ్‌గారు ప్రతి క్యారెక్టర్‌ని అద్భుతంగా డిజైన్‌ చేశారు. ప్రేక్షకులు ఎంజాయ్‌ చేసే విధంగా ఈ చిత్రం ఉంటుంది. మోషన్‌ పోస్టర్‌ లాంచ్‌ చేసిన రాజ్‌ కందుకూరిగారికి స్పెషల్‌ థాంక్స్‌.. అన్నారు. 

మరో నటుడు సంకేత్‌ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో నటించాను ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్‌గారికి నా థాంక్స్‌..అన్నారు. 

నటి ఆరోహి నాయుడు మాట్లాడుతూ.. కిల్లర్‌ క్యారెక్టర్‌లో నటించాను. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను.. అన్నారు. 

ఈ చిత్రానికి కథ: హరికిరణ్‌, సంగీతం: కనిష్క, కెమెరా: జి.యల్‌.బాబు, ఎడిటింగ్‌: అనిల్‌ జల్లు, మాటలు: రాకేష్‌ రెడ్డి, స్క్రీన్‌ ప్లే - దర్శకత్వం: విజయ్‌ కిరణ్‌, నిర్మాత: విజయ్‌ జగత్‌.

PAISA PARAMATMA Motion Poster Released:

<span>Producer Raj Kandukuri Launches PAISA PARAMATMA Motion Poster&nbsp;</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs