Advertisement
Google Ads BL

'సాక్ష్యం' బ్లాక్ బస్టర్ కావాలి: వి.వి.వినాయక్!


'అల్లుడు శీను, స్పీడున్నోడు, జయ జానకీ నాయకా' చిత్రాలతో ప్రేక్షకుల్లో మాస్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకొన్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అల్లుడు శీను రిలీజ్ అయి నేటికి నాలుగు సంవత్సరాలు అయింది. పక్కింటి కుర్రాడిలా అనిపించే ఈ కమర్షియల్ హీరో లేటెస్టుగా 'సాక్ష్యం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. (నేచర్ ఈజ్ విట్నెస్) టాగ్ లైన్. పంచ భూతాలు నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో గ్లామర్ స్టార్ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై శ్రీవాస్ దర్శకత్వంలో యంగ్ డైనమిక్ ప్రొడ్యూసర్ అభిషేక్ నామా భారీ బడ్జెట్ తో  నిర్మించిన 'సాక్ష్యం'  చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికేట్ ని పొందింది.ఈ చిత్రాన్ని జూలై 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్బంగా ప్రసాద్ ల్యాబ్ లో ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సెన్షేషనల్ డైరెక్టర్ వి వి వినాయక్, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, హీరోయిన్ పూజా హెగ్డే, నిర్మాత అభిషేక్ నామా పాల్గొన్నారు. సాక్ష్యం చిత్రంలోని హీరో ఇంట్రడక్షన్ సాంగ్ 'డెస్టిని' పాటని వినాయక్ రిలీజ్ చేశారు. అనంతరం పాటల్ని,  ట్రైలర్స్ ని స్క్రీన్ పై ప్రదర్శించారు. 

Advertisement
CJ Advs

బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి!!

సెన్షేషనల్ డైరెక్టర్  వి.వి.వినాయక్ మాట్లాడుతూ- అల్లుడుశీను రిలీజ్ అయి అప్పుడే నాలుగు ఏళ్ళు అయిందంటే నమ్మలేకుండా వున్నాను. నిన్ననే షూటింగ్ చేసినట్లుంది. సాయి సినిమా సినిమాకి చాలా మెచ్యూర్డ్ గా ఎదుగుతున్నాడు. అతను ఇంకా మంచి సినిమాలు చేసి పెద్ద  హీరో అవ్వాలని కోరుకుంటున్నాను. పూజా హెగ్దే ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. సాక్ష్యం ట్రైలర్ చాలా బాగుంది. అభిషేక్ చాలా ప్రెస్టీజియస్ గా, ఛాలెంజింగ్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు. విజువల్స్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. సినిమా అంతా రిచ్ గా, గ్రాండ్ గా నిర్మించారు. శ్రీవాస్ చెన్నైలో మిక్సింగ్ లో ఉండి రాలేక పోయాడు. అతనికి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

విజువల్స్ స్టన్నింగ్ గా ఉంటాయి!!

హీరోయిన్ పూజా హేగ్దే మాట్లాడుతూ- జూలై 27న సాక్ష్యం రిలీజ్ అవుతుంది. చాలా నెర్వస్ గా, ఎక్సయిటింగ్ గా ఉంది. సినిమా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఈ చిత్రంలో న్యూ క్యారెక్టర్ చేశాను. విజువల్స్ అన్నీ స్టన్నింగ్ గా ఉంటాయి. ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. డెఫనెట్ గా ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది అన్నారు.

పెద్ద విజయం చెయ్యాలి!!

చిత్ర నిర్మాత అభిషేక్ నామా  మాట్లాడుతూ- మా సినిమా సాక్ష్యం జూలై 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించి పెద్ద విజయం చెయ్యాలని కోరుకుంటున్నాను. అన్నారు.

ఇలాంటి గొప్ప సినిమా చేసినందుకు హ్యాపీగా ఉంది!!

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ-  మా టీమ్  అందరం కలిసి ఒక మంచి సినిమా చేశాం. ఇలాంటి చిత్రాలను ఆదరిస్తేనే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి. అల్లుడు శీను సినిమా వచ్చి ఫోర్ ఇయర్స్ అయింది. ఇది నా నాలుగవ సినిమా. నన్ను హీరోగా లాంచ్ చేసిన వినాయక్ గారు వచ్చి ఇప్పుడు సాక్ష్యంలో నా ఇంట్రడక్షన్ సాంగ్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆయనికి నా థాంక్స్ తెలుపుకుంటున్నాను. అభిషేక్ గారు అన్ కాంప్రమైజ్డ్ గా ఈ చిత్రాన్ని లావిష్ గా నిర్మించారు. శ్రీవాస్ గారి కథ మా టీమ్ అందరికీ మంచి ఎనర్జీనిచ్చింది. ఆయన విజన్ కి ప్రతి ఒక్కరూ న్యాయం చేశారు. ఇలాంటి ఒక గొప్ప కథతో ఈ చిత్రాన్ని రూపొందించిన శ్రీవాస్ గారికి ధన్యవాదాలు. ఈరోస్ వాళ్ళు మా సినిమాతో టయ్యప్ అవడం ప్రెస్టీజియస్ గా ఫీలవుతున్నాను. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించి సపోర్ట్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

VV Vinayak Wishes To Saakshyam Team:

Saakshyam Pre Release Press Meet Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs