మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి సినిమా విడుదల తేది ఖరారు!
హీరో వరుణ్ తేజ్, దర్శకుడు సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, అదితిరావ్ హైదరీ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ మూవీలో హాలీవుడ్ తరహా స్టంట్స్ ఉండబోతున్నాయి. అందుకోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ జిబెక్, టోడోర్ లాజరవ్ (జూజి), మరియు రోమన్ వర్క్ చెయ్యడం జరిగింది. హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ అదితిరావ్ హైదరీ పై 3డి స్కాన్ చెయ్యడం జరిగింది. సినిమాకు ఈ టెక్నాలజీ మరింత హెల్ప్ కానుంది. గతంలో వీరు ఎక్ష్పపాండబుల్స్2, ట్రాయ్, జీరో డార్క్ థట్టి, హీర్సులేస్, ది ఇంవీసిబుల్, లొవింగ్ పాబ్లో, రీబార్న్, స్నిప్పెట్, మార్కో పోలో, గేమ్ అఫ్ త్రోన్స్ వంటి హాలివుడ్ చిత్రాలకు వీరు పని చేసారు.