Advertisement
Google Ads BL

ఫస్ట్ లుక్: శైలజా రెడ్డి అల్లుడా..మజాకా..!!


ఈ ఏడాది నాగ చైతన్య  సినిమాలకు సంబందించిన అప్ డేట్స్ ఏమి ఇంతవరకు అక్కినేని అభిమానులకు కిక్ ఇవ్వలేదు. సవ్యసాచి ఫస్ట్ లుక్ తో మాస్ గా కనబడినా నాగ చైతన్య ఇప్పుడు క్లాసీ గా సూపర్ లుక్ తో అక్కినేని అభిమానులనే కాదు సాధారణ ప్రేక్షకులను కూడా ఫిదా చేసేశాడు. మారుతీ దర్శకత్వంలో అను ఇమ్మాన్యుయేల్ తో రొమాన్స్ చేస్తున్న నాగ చైతన్య శైలజారెడ్డి అల్లుడు గా ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు. శివగామి పాత్రలో విశ్వరూపం చూపించిన రమ్యకృష్ణ ఈ సినిమాలో నాగ చైతన్యకి పొగరున్న అత్తాగా శైలజ రెడ్డి పాత్రలో నటిస్తుంది.  మరి ప్రస్తుతం ఈ రోజు సోమవారం ఉదయం శైలజ రెడ్డి లుక్ ని మూవీ యూనిట్ విడుదల చేసింది.

Advertisement
CJ Advs

మరి ఆ శైలజా రెడ్డి అల్లుడు సినిమా ఫస్ట్ లుక్ లో రమ్యకృష్ణ పవర్ ఫుల్ అత్తగా... కుర్చీలో కూర్చుని సీరియస్ లుక్ తో చైతు అండ్ అను ఇమ్మాన్యుయేల్ ని చూస్తుంటే... అల్లుడు నాగ చైతన్య మాత్రం అత్తగారి లుక్ కి ఏ మాత్రం భయపడకుండా ఆమె కూతురు అను ఇమ్మాన్యుయేల్ ని రొమాంటిక్ గా హగ్ చేసుకుని స్టైలిష్ స్మైల్ తో అదరగొడుతున్నాడు. అలాగే శైలజ రెడ్డి అల్లుడు మూవీ ఫస్ట్ లుక్ లో మరో లుక్  నాగ చైతన్య మొన్నామధ్యన సోషల్ మీడియాలో హల్చల్ చేసిన లుక్కే. ఆ లుక్ లో నాగ చైతన్య ఫార్మల్ వేర్ లో టక్ చేసుకుని క్లాస్ లుక్ లో చంపేస్తున్నాడు. మరి అదే లుక్ ని గతంలో యూనిట్ సభ్యులెవరో ఇంటర్నెట్ లో లీక్ చేసి ఉండవచ్చు. అయినప్పటికీ చైతు ఈ క్లాస్ లుక్ మాత్రం అదుర్స్.

ఇక రమ్యకృష్ణ మాత్రం పొగరుబోతు అత్తగా.. నాగ చైతన్యతో కఠినంగా ఉండే క్యారెక్టర్ లో కనిపిస్తుండగా... నాగ చైతన్య మాత్రం అత్తని ఆటపట్టించే అల్లుడిగా నటిస్తున్నాడనుకోవాలి ఈ పోస్టర్ చూస్తుంటే. మరి మారుతీ ఈ సినిమాని రొటీన్ కి భిన్నంగా తెరకెక్కిస్తున్నాని చెబుతున్నాడు. మరి ఎంతవరకు కొత్తదనంని ఈ సినిమాలో మారుతీ చూపిస్తాడో చూడాలి. గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఆగష్టు నెలాఖరున విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాపై నాగ చైతన్య మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడనేది మూవీ యూనిట్ మాట. 

Shailaja Reddy Alludu First Look:

First Look: Shailaja Reddy And Her Alludu  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs