Advertisement
Google Ads BL

'అంతకుమించి' ట్రైలర్ బాగుంది: సుకుమార్!


సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ చేతుల మీదుగా 'అంతకుమించి' ట్రైలర్ విడుదల

Advertisement
CJ Advs

ఎస్.జై. ఫిలింస్ పతాకంపై రూపుదిద్దుకున్న చిత్రం 'అంతకుమించి'. జై, రష్మీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు సతీష్ గాజుల మరియు ఎ. పద్మనాభ రెడ్డి. సహ నిర్మాతలు భాను ప్రకాష్ తేళ్ల మరియు కన్నా. హర్రర్ థ్రిల్లర్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి జానీ దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు చూడని సరికొత్త పాత్రలో రష్మీని చూపించబోతోందీ సినిమా. షూటింగ్ పూర్తి చేసుకుని సెన్సార్ కార్యక్రమాలకు రెడీ అయిన ఈ చిత్రం ట్రైలర్ ని సెన్సేషనల్ దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ.. అంతకుమించి ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది. ఇంప్రెస్ చేసింది. ట్రైలర్ చూశాక ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని నాకే అనిపిస్తుంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను... అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ.. మా ట్రైలర్ ను సెన్సేషనల్ దర్శకులు సుకుమార్ గారి చేతుల మీదుగా విడుదల చేసినందుకు ఆనందంగా వుంది. మేము అడగగానే మా చిత్ర ట్రైలర్ ని విడుదల చేసినందుకు సుకుమార్ గారికి మా చిత్ర టీం తరుపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రస్తుతం సినిమాకి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ కార్యక్రమాలు పూర్తవ్వగానే రిలీజ్ డేట్ ప్రకటిస్తాము. ఇక సుకుమార్ గారు విడుదల చేసిన ట్రైలర్.. సోమవారం సాయంత్రం 5 గంటలకు యూట్యూబ్ లో అప్లోడ్ చేయనున్నాము. సినిమాకి సహకరించిన అందరికీ ధన్యవాదాలు.. అన్నారు. 

హీరో జై మాట్లాడుతూ.. ముందుగా సుకుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ చిత్రంలో మధ్య తరగతి యువకుడి పాత్రలో నటించాను. మన చుట్టుపక్కల చూసే ఓ సాదా సీదా కుర్రాడిగా కనిపిస్తాను. సహజంగా నటించే అవకాశమున్న పాత్ర. రష్మీతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఆమె పాత్రకు తగ్గకుండా నా క్యారెక్టరైజేషన్ ఉంటుంది. రష్మి సహకారం మర్చిపోలేను. అందరం కథపై నమ్మకంతో ఉన్నాం. దర్శకుడు జానీ కథను మరింత బాగా తెరకెక్కించారు. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని నమ్మకంతో వున్నాం.. అన్నారు.

దర్శకుడు జానీ మాట్లాతుడూ.. దర్శకుడిగా నాకు తొలి చిత్రమిది. నా తొలి చిత్ర ట్రైలర్ ని సుకుమార్ గారు విడుదల చేయడం ఎంతో ఆనందాన్నిచ్చింది. గతంలో హార్రర్ తరహా కథలు చాలా చూశాం. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లు సహా  అందరి పాత్రలు చాలా సహజంగా ఉంటాయి. మంచి సాంకేతిక నిపుణుల సహాయంతో అనుకున్న సమయానికి అనుకున్నట్లు చిత్రీకరణ జరిపాం. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మించారు. హీరో జై, హీరోయిన్ రష్మీలకు గుర్తుండిపోయే చిత్రమవుతుందని నమ్ముతున్నాం.. అన్నారు

సూర్య, మధు నందన్, రవి ప్రకాష్, అజయ్ ఘోష్, జెమినీ సురేష్, టీవీ9 హర్ష, వంశీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: కరుణాకర్, సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి, స్టంట్స్: రామ్ సుంకర, సంగీతం: సునీల్ కశ్యప్, ఎడిటర్: క్రాంతి, మాటలు: మోహన్ చందా, సహ నిర్మాతలు: భాను ప్రకాష్ తేళ్ల, కన్నా, నిర్మాతలు: సతీష్ గాజుల మరియు ఎ. పద్మనాభ రెడ్డి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జానీ.

Anthakuminchi Trailer Released:

Sukumar Launches Anthakuminchi Trailer
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs