Advertisement
Google Ads BL

​'క్షణం'లా ఈ మూవీ పెద్ద హిట్టవ్వాలి: సమంత!


అడవి శేష్ 'గూఢచారి' టీజర్ ను విడుదల చేసిన సమంత !

Advertisement
CJ Advs

అడవి శేష్ 'గూఢచారి' సినిమా ఆగష్టు 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శశికిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా స్పై థ్రిల్లర్ జోనర్ లో రూపొందుతున్న‌ది. ఈ సినిమా ద్వారా తెలుగమ్మాయి, మోడ‌ల్ శోభిత హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ పిక్చర్స్ బ్యాన‌ర్స్ పై ఈ సినిమా తెరకెక్కింది. హీరోయిన్ సమంత 'గూఢచారి' టీజర్ ను విడుదల చేసారు. 

ఈ సందర్బంగా సమంత మాట్లాడుతూ...టీజర్ చాలా బాగుంది. సినిమా హై బడ్జెట్ లో తీసినట్లు రిచ్ గా ఉంది. ఈ సినిమా టీజర్ ను లాంచ్ చెయ్యడం హ్యాపీ గా ఉంది. క్షణం సినిమాలాగే ఈ మూవీ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. అందరిలాగే ఈ సినిమా కోసం నేను వెయిట్ చేస్తున్నా.. అన్నారు.

అడవి శేష్ మాట్లాడుతూ.. డైరెక్టర్ శశి ఈ సినిమాను గొప్పగా తెరకెక్కించారు. విజువల్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. 168 లొకేషన్స్ లో ఈ సినిమాను తీయడం జరిగింది. మంచి బడ్జెట్ ఇచ్చి మాకు సహకరించిన నిర్మాతలకు థాంక్స్. మా టీజర్ ను రిలీజ్ చేసిన సమంత కు స్పెషల్ థాంక్స్. గూఢచారి సినిమా ప్రేక్షకులను థ్రిల్ చెయ్యబోతోంది..అన్నారు.

డైరెక్టర్ శశి మాట్లాడుతూ.. గూఢచారి సినిమా చెయ్యడానికి సహకరించిన నిర్మాతలకు, టెక్నీషియన్స్ కు కృతజ్ఞతలు. సినిమా బాగా వచ్చింది. టీజర్ కు మంచి రెస్పాన్స్ లభిస్తుంది..అన్నారు.

అబ్బూరి రవి మాట్లాడుతూ...అడవిశేష్ అందరితో బాగా వర్క్ చేయించుకున్నారు. డైరెక్టర్ శశి చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. సెకండ్ హాఫ్ లోని విజువల్స్ ప్రేక్షకులను అలరిస్తాయి.. అన్నారు. 

నిర్మాత అభిషేక్ నమ మాట్లాడుతూ...160 డేస్ లో సినిమాను చిత్రీకరించాము. కథ, కథనాలు ఆడియన్స్ కు నచ్చే విధంగా ఉంటాయి. అవుట్ పుట్ చూసాను. సినిమా బాగా వచ్చింది. సినిమాకు కావాల్సిన ప్రతిఒక్కటి శేష్  చూసుకున్నారు.. అన్నారు.

నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. అడవి శేష్ కు ఈ సినిమా మైల్ స్టోన్ సినిమా అవుతుందని నమ్ముతున్నాను. గూఢచారి టీజర్ బాగుంది. చిత్ర యూనిట్ పడిన కష్టం టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. చిత్ర యూనిట్ సభ్యులకు అభినందనలు తెలుపుతున్నాను.. అన్నారు.

Samantha Launches Goodachari Teaser:

Goodachari Teaser Release highlights 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs