Advertisement
Google Ads BL

అత్యాశ ఉన్న ప్రతి చోటా.. ఈయన ఉంటాడు!


సత్యదేవ్ - నందితాశ్వేత కాంబినేషన్ లో గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో అభిషేక్ ఫిలిమ్స్ చిత్రం 'బ్లఫ్ మాస్టర్'

Advertisement
CJ Advs

ఆశ, అత్యాశ‌ల నేపథ్యంలో రూపొందిన  'చ‌తురంగ వేట్టై' చిత్రానికి  త‌మిళ  ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఇప్పుడీ చిత్రం తెలుగులో రీమేక్ అయ్యింది. అభిషేక్ ఫిలిమ్స్ అధినేత ర‌మేష్ పిళ్లై ఈ చిత్రానికి నిర్మాత. గోపీ గ‌ణేష్ ప‌ట్టాభి దర్శకుడు. 'జ్యోతిల‌క్ష్మి, ఘాజి' చిత్రాల ఫేమ్ స‌త్య‌దేవ్ హీరోగా నటించారు. 'ఎక్క‌డికి పోతావు చిన్నవాడా' చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కులకు దగ్గరైన  నందితా శ్వేత ఇందులో నాయిక‌. 

ఈ సినిమా గురించి నిర్మాత ర‌మేష్ పిళ్లై మాట్లాడుతూ..తొలిసారిగా అభిషేక్ ఫిలిమ్స్ పతాకంఫై  లారెన్స్ నటించిన శివలింగ తమిళ చిత్రాన్ని తెలుగులో అనువదించి మంచి విజయాన్ని సాధించాము. త‌మిళంలో ఘ‌న విజ‌యాన్ని సాధించిన  చిత్రం 'చ‌తురంగ వేట్టై'ని తెలుగులో రీమేక్ చేశాం. చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. కొడైకెనాల్‌, కర్నూలు, వైజాగ్‌, హైద‌రాబాద్‌లో చిత్రీకరణ జరిపాం. ఎక్క‌డా రాజీప‌డ‌కుండా హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వర్క్ జరుగుతోంది. పాటలను జూలై నెలాఖరున, చిత్రాన్ని ఆగస్ట్ లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం.  ప్ర‌తి ఒక్క‌రికీ క‌నెక్ట్ అయ్యే సినిమా ఇది.. అని అన్నారు. 

దర్శకుడు గోపీ గణేష్ పట్టాభి మాట్లాడుతూ.. రోజూ ఏ దినపత్రిక చదివినా, ఏ టీవీ ఛానల్ చూసినా 90 శాతం మోసాల గురించే ఉంటాయి. మనిషికి ఆశ సహజం. కానీ అది అత్యాశగా మారినప్పుడే ఘోరాలు, నేరాలు జరుగుతాయి. అత్యాశ ఉన్న ప్రతి చోటా ఒక బ్లఫ్ మాస్టర్ ఉంటాడు.  ఆ నేపథ్యంలోనే ఈ సినిమా ఉంటుంది. బ్లఫ్ మాస్టర్ గా సత్యదేవ్ అదరగొట్టేశాడు. ఈ సినిమాలో ప్రతి పాత్ర చాలా లైవ్లీగా ఉంటుంది.. అని చెప్పారు. 

Satya Dev and Nandita Swetha in Bluff Master:

Bluff Master Movie Remaked From&nbsp;<span>Sathuranga Vettai Tamil Film</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs