Advertisement
Google Ads BL

నందితా మరో భయపెట్టే పాత్రలో..!


‘గీతాంజలి, త్రిపుర’ వంటి సక్సెస్ ఫుల్ లేడీ ఓరియంటెడ్ మూవీస్ తెరకెక్కించిన రాజకిరణ్ ప్రస్తుతం మరో లేడీ ఓరియంటెడ్ మూవీ తెరకెక్కిస్తున్నారు. 'విశ్వామిత్ర' టైటిల్ తో మాధవి అద్దంకి, రజనీకాంత్‌ యస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం గత నెల ప్రారంభమైన విషయం తెలిసిందే. పది రోజులుగా హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్‌ చిత్రీకరణ జరుపుకుంది. 'ప్రేమకథా చిత్రమ్' ఫేమ్ నందితా ఇందులో కథానాయిక. ఈ షెడ్యూల్‌లో హీరోయిన్‌ ‘నందితా’ ఇంట్రడక్షన్, సినిమాలో కీలకమైన పోలీస్‌స్టేషన్‌ సీన్లను ప్రముఖ నటుడు ప్రసన్నపై చిత్రీకరించారు. 

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా దర్శకుడు రాజకిరణ్‌ మాట్లాడుతూ.. స్విట్జర్లాండ్, అమెరికాలలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సినిమా మొదటి ఫ్రేమ్‌ నుంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తుంది. నా గత చిత్రాలు ‘గీతాంజలి, త్రిపుర’ కథలలో థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఉన్నట్లుగానే  ఈ సినిమా కూడా అదే  థ్రిల్‌ మెయింటేన్‌ చేస్తుంది. ఈ కథ నచ్చి ‘జక్కన్న’ చిత్ర దర్శకుడు ఆకెళ్ల వంశీకృష్ణ మాటలు రాస్తుండటం విశేషం. ఈ చిత్రానికి కెమెరా: అనిల్‌ భండారి, మాటలు: ఆకెళ్ల వంశీకృష్ణ, ఎడిటర్‌: ఉపేంద్ర, ఆర్ట్‌–చిన్నా. నిర్మాతలు: మాధవి అద్దంకి, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: రాజకిరణ్‌

Nanditha Raj roped in as Heroine of Vishwamitra:

Nanditha Raj in Vishwamitra
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs