Advertisement
Google Ads BL

'కన్నుల్లో నీ రూపమే' విడుదలకు రెడీ!


ఎ.ఎస్.పి క్రియేషన్స్ పతాకంపై ఇరుసడ్ల రాజమౌళి సమర్పణలో భాస్కర్ బాసాని నిర్మాతగా, బిక్స్ ఇరుసడ్ల దర్శకుడిగా పరిచయమౌతున్న చిత్రం 'కన్నుల్లో నీ రూపమే'.

Advertisement
CJ Advs

ఈ చిత్రం ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఆడియోకి మంచి స్పందన వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఆడియో సక్సెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రముఖ నిర్మాత 'సిందూర పువ్వు' కృష్ణారెడ్డి గారు, చిత్ర యూనిట్ సభ్యులు మహేశ్వర్ రెడ్డి, భాస్కర్ మన్యం, డైరెక్టర్ బిక్స్ ఇరుసడ్ల, మ్యూజిక్ డైరెక్టర్ సాకేత్, కెమెరామెన్ విశ్వ, సుభాష్, నిర్మాత భాస్కర్ బాసాని మరియు రామ మోహన రావు ఇప్పిలి తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్బంగా నిర్మాత భాస్కర్ బాసాని మాట్లాడుతూ... సాకేత్ ఇచ్చిన మ్యూజిక్ మా చిత్రానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇంతమంచి సంగీతాన్నిచ్చిన సాకేత్ కి  ధన్యవాదాలు. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి మా చిత్ర యూనిట్ ని ఆశీర్వదించటానికి వచ్చిన  పెద్దలు  'సిందూర పువ్వు' కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.ఈ నెల 29 న మీ ముందుకు వస్తున్న 'కన్నుల్లో నీ రూపమే'  చిత్రాన్ని ఆదరించాలని అలానే మీ మీడియా సపోర్ట్  ఎప్పటిలానే మా మీద ఉండాలని కోరుకొంటున్నాని తెలియజేశారు.

హరి హర చలన చిత్ర నిర్మాత ఇప్పిలి రామ మోహన రావు మాట్లాడుతూ.. మా 'ఇంతలో ఎన్నెన్ని వింతలో ..' చిత్రాన్ని ఆదరించినట్లే ఈ 'కన్నుల్లో నీ రూపమే'  చిత్రాన్ని ఆదరించాలని కోరుకొంటున్నాను. ఈ చిత్రాన్ని చూసిన వెంటనే మ్యూజిక్ డైరెక్టర్ గురించి తెలుసుకున్నాను. ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ సాకేత్ ని ఆడియో సక్సెస్  మీట్ లో కలవటం చాలా ఆనందంగా వుంది. దర్శకుడు  బిక్స్ గారికి  నిర్మాత భాస్కర్ బాసాని గారికి నా బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నా' అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సాకేత్ మాట్లాడుతూ...  కన్నుల్లో నీ రూపమే' చిత్రానికి పనిచేయటం చాలా ఆనందంగా వుంది. దర్శకుడు  బిక్స్ గారు నాకు ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యారు, నాకు మొదటగా కథ చెప్పినప్పుడు నేను చాలా ఇంప్రెస్స్ అయ్యాను, బిక్స్ గారు చాలా అనుభవం వున్న దర్శకుడిలా చిత్రాన్ని తీశారు. ఇటువంటి మంచి చిత్రంలో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు చాలా సంతోషంగా వుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి పనిచేసిన మా టెక్నిషియన్స్ కి మరియు మా సింగెర్స్ నా గురువుగారు బాలు గారికి, చిత్ర గారికి, అక్క గీత మాధురికి  మిగతా నా ఫ్రెండ్స్ అందరికి  ప్రత్యేక కృతజ్ఞతలు. నా మొదటి సినిమా 'కన్నుల్లో నీ రూపమే' ఆడియో సక్సెస్ మీట్.....జరుపుకోవటం చాలా ఆనందంగా వుంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ చిత్ర  దర్శకుడు  బిక్స్ గారికి, నిర్మాత భాస్కర్ బాసాని గారికి ధన్యవాదములు తెలియజేసుకొంటున్నాను అన్నారు.

ప్రముఖ నిర్మాత  'సిందూర పువ్వు' కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ... చిన్న చిత్రాలు విడుదల చెయ్యటం ఈ రోజుల్లో  చాలా కష్టం. బిక్స్ గారు ఈ చిత్రం గురించి ఎంత కష్టబడ్డారో నాకు తెలుసు. ఈ నెల 29 న విడుదల అవుతున్న ఈ చిత్రం మంచి విజయం సాధించి బిక్స్ కి మరియు చిత్ర యూనిట్ సభ్యులందరికి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను అన్నారు.

దర్శకుడు  బిక్స్ మాట్లాడుతూ... ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి అడగ్గానే అంగీకరించి మమ్మల్ని ఆశీర్వదించటానికి వచ్చిన మా శ్రేయోభిలాషి   'సిందూర పువ్వు' కృష్ణారెడ్డి గారికి ధన్యవాదములు, మా 'కన్నుల్లో నీ రూపమే'  చిత్రాన్ని బాగా ప్రమోట్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంత మంచి సంగీతాన్ని ఇచ్చిన సోదరుడు సాకేత్ కు కృతజ్ఞతలు. మా చిత్ర విడుదలకు సహాయం చేస్తున్న మా మిత్రులు ఇప్పిలి రామమోహన్ రావు, ఎస్ శ్రీకాంత్ రెడ్డి గార్లకు ధన్యవాదాలు. మా 'కన్నుల్లో నీ రూపమే' ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది, అందరు ఆదరించి మమ్ములను ఆశీర్వదిస్తారని కోరుకొంటూన్నాను అన్నారు.

Kannullo Nee Roopame Ready to Release:

Kannullo Nee Roopame Audio Success Meet Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs