Advertisement
Google Ads BL

ఐపిసి సెక్షన్ భార్యాబంధు: మార్నింగ్ షో ఫ్రీ!!


శరత్ చంద్ర-నేహా దేశ్ పాండే హీరోహీరోయిన్లుగా..  రెట్టడి శ్రీనివాస్ దర్శకత్వంలో ఆలూరి క్రియేషన్స్ పతాకంపై ఆలూరి సాంబశివరావు నిర్మించిన చిత్రం 'ఐపిసి సెక్షన్ భార్యాబంధు'. 'సేవ్ మెన్ ఫ్రమ్ విమెన్' అన్నది ట్యాగ్ లైన్. ప్రముఖ నటి ఆమని ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రం ఈనెల 29న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని విడుదల రోజు ఉదయం ఆటను అందరికీ ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మల్టీ ప్లెక్స్ మినహా ఈ చిత్రం విడుదలవుతున్న అన్ని థియేటర్స్ (సింగిల్ స్క్రీన్స్) కు ఇది వర్తిస్తుంది.

Advertisement
CJ Advs

దర్శకుడు రెట్టడి శ్రీనివాస్ ఈ విషయాన్ని ప్రకటించారు. సినిమాపై నమ్మకంతో నిర్మాత ఆలూరి సాంబశివరావు ఈ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారని.. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ పదిమందికి చెబుతారనే నమ్మకంతో ఈ ఆఫర్ ఇస్తున్నామని శ్రీనివాస్ అన్నారు. దర్శకత్వ శాఖలో సుదీర్ఘ అనుభవం కలిగిన తాను 'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు' వంటి మంచి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతుండడం గర్వంగా ఉంది అన్నారు. మహిళల రక్షణ కోసం చేసిన చట్టాలను కొందరు మహిళలు ఎలా దుర్వినియోగం చేస్తున్నారు అనే అంశం ఆధారంగా రూపొందిన సందేశభరిత వినోదాత్మక చిత్రమిది. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'అభిలాష'  తర్వాత భారత రాజ్యాంగంలోని ఒక సెక్షన్ ని బేస్ చేసుకొని రూపొందిన తెలుగు చిత్రం 'ఐపిసి సెక్షన్ భార్యబంధు'. ఆమని గారు స్వాతి శ్రీపాద అనే రైటర్ కమ్ కౌన్సిలర్ గా నటించారు. ఆమె పాత్ర చిత్రానికి హైలైట్ అవుతుంది. నిర్మాత ఆలూరి సాంబశివరావు గారికి  సినిమా అంటే పేషన్ తో పాటు మంచి అవగాహన కూడా ఉంది. మేకింగ్ పరంగా ఎక్కడా రాజీ పడలేదు. చక్కని సందేశానికి చిక్కని వినోదం జోడించి రూపొందించిన  'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు' ఘన విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం. ఆ నమ్మకంతోనే విడుదల రోజు ఉదయం ఆట ఉచితంగా చూపిస్తున్నాం' అన్నారు!!

IPC Section Bharya Bandhu Morning Show Free on Release Day:

IPC Section Bharya Bandhu Director Interview
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs