Advertisement
Google Ads BL

నా విజేతకి, ఈ విజేతకి సారూప్యత ఉంది: చిరు!


మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కిన విజేత సినిమా ఆడియో రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి తో పాటు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, కీరవాణి, అల్లు అరవింద్, నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్, నిర్మాత ఎన్. వి.ప్రసాద్ మరియు మైత్రి మూవీస్ చెర్రి, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. 

Advertisement
CJ Advs

ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ...

'విజేత ఆడియోకు విచ్చేసిన అతిథితులందరికి ధన్యవాదాలు. 35 ఏళ్ల క్రిందట నేను చేసిన విజేత సినిమా టైటిల్ తో ఇప్పుడు సినిమా రావడం సంతోషంగా ఉంది. డైరెక్టర్ నా దగ్గరికి వచ్చి కథ చెప్పినప్పుడు నచ్చింది. తండ్రి, కొడుకుల మధ్య రిలేషన్ ఈ సినిమాలో చక్కగా చూపించడం జరిగింది. కొత్త తరగతి ఆడియన్స్ కు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. కళ్యాణ్ దేవ్ కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. రొమాంటిక్ సీన్స్, ఎమోషన్స్ సీన్స్ లో తన నటన చక్కగా కనపరచడం  జరిగింది. రాజేష్ శశి ఈ చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దారు. నిర్మాత సాయి కొర్రపాటి కథలో ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. సెంథిల్ ఈ సినిమాకు కెమెరామెన్ గా చెయ్యడం సినిమాకు మొదటి సక్సెస్. విజేత సినిమా విజయం సాధించి అందరికి మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నా' అన్నారు.

డైరెక్టర్ రాకేష్ శశి మాట్లాడుతూ...

'నిర్మాత సాయి గారు నేను సినిమా చేద్దాం అనుకున్న తరువాత కథ సిద్ధం చేశాను. కథ పూర్తి అయ్యాక చిరంజీవి గారిని కలిసి స్టోరి చెప్పడం జరిగింది. చిరంజీవి గారికి కథ నచ్చి సినిమా స్టార్ట్ చెయ్యమని చెప్పారు. కళ్యాణ్ దేవ్ కథను నమ్మి ఈ సినిమా చేశారు. సాయి గారు నన్ను నమ్మి ఈ సినిమా చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సినిమా అందరిని అలరిస్తోందని నమ్ముతున్నాను' అన్నారు.

ఈ సందర్బంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ...

'విజేత సినిమా టైటిల్ తో కళ్యాణ్ దేవ్ సినిమా చెయ్యడం సంతోషంగా ఉంది. కొత్త టాలెంట్ తో సినిమాలు చేసే నిర్మాత సాయి కొర్రపాటికి ఆల్ ది బెస్ట్. తెలుగు ఇండస్ట్రీకి ఇలాంటి నిర్మాతలు కావాలి. కళ్యాణ్ దేవ్ టాలెంటెడ్ నటుడు. ప్రోమోస్, సాంగ్స్ చూస్తుంటే తెలుస్తుంది. అతను సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా' అన్నారు.

మురళి శర్మ మాట్లాడుతూ...

'మెగాస్టార్ చిరంజీవి ముందు మాట్లాడడం ఆనందంగా ఉంది. నా కోసం ఇంతటి మంచి పాత్రను రాసినందుకు డైరెక్టర్ రాకేష్ శశికి థాంక్స్. కళ్యాణ్ దేవ్ సక్సెస్ అవ్వాలని, అతనికి మీ అందరికి బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటున్నా' అన్నారు. 

కెమెరామెన్ కె.కె.సెంథిల్ కుమార్ మాట్లాడుతూ...

'నిర్మాత సాయి కొర్రపాటి గారు కలిసి ఈ కథ చెప్పి సినిమా చెయ్యమని చెప్పారు. కథ నచ్చడంతో సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాను. మురళి శర్మ తన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. కళ్యాణ్ దేవ్ మంచి ట్యాలెంట్ ఉన్న నటుడు. సినిమా తప్పకుండా సక్సెస్ సాధిస్తుంది' అన్నారు.

రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ...

'డైరెక్టర్ రాకేష్ శశి ఈ కథ చెప్పినప్పుడు 'విజేత' టైటిల్ కరెక్ట్ గా సెట్ అవుతుందని అనిపించింది. ఈ సినిమాలో రాసిన మూడు పాటలు డిఫరెంట్ గా ఉన్నాయి. సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ పెద్ద సంగీత దర్శకుడు అవుతారు. సాయి కొర్రపాటి గారితో వర్క్ చెయ్యడం సంతోషంగా ఉంది' అన్నారు.

దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ...

'ట్రైలర్ చూశాక సినిమాపై అంచనాలు పెరిగాయి. విజేత విడుదల తరువాత నిర్మాత సాయి కొర్రపాటికి మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నా. ప్రేమ్ రక్షిత్ కోడి సాంగ్ ను బాగా కొరియోగ్రఫీ చేశారు. కళ్యాణ్ దేవ్ కు, చిత్ర యూనిట్ అందరికి నా బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను' అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వరన్ మాట్లాడుతూ...

'ఆడియో విడుదలకు విచ్చేసిన పెద్దలందరికి థాంక్స్. రామజోగయ్య శాస్త్రి గారు రహమాన్ మంచి సాహిత్యం అందించారు. సినిమా తప్పకుండా బాగుంటుంది' అన్నారు.

హీరోయిన్ మాళవిక నాయర్ మాట్లాడుతూ...

'సాంగ్స్ అన్నీ బాగున్నాయి. మంచి మ్యూజిక్ ఇచ్చిన హర్షవర్షన్ రామేశ్వరన్ గారికి థాంక్స్. సాయి కొర్రపాటి గారితో వర్క్ చెయ్యడం హ్యాపీగా ఉంది. కళ్యాణ్ దేవ్ హానెస్ట్ మరియు హార్డ్ వర్కింగ్ నేచర్ ఉన్న హీరో' అన్నారు. 

నటీనటులు:

కళ్యాణ్ దేవ్, మాళవిక నాయర్, తనికెళ్ళ భరణి, మురళి శర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పృథ్వి, రాజీవ్ కనకాల, జయ ప్రకాష్ (తమిళ్), ఆదర్శ్ బాలకృష్ణ, నోయల్, కిరీటి, భద్రం, సుదర్శన్, మహేష్ విట్టా.

సాంకేతిక నిపుణులు: కథ,స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: రాకేష్ శశి, నిర్మాత: రజిని కొర్రపాటి, సాయి కొర్రపాటి ప్రొడక్షన్, ప్రెజెంటర్: సాయి శివాని, కెమెరామెన్: కె.కె.సెంథిల్, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, సాహిత్యం: రెహమాన్, రామజోగయ్య శాస్త్రి, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణ, స్టంట్స్: జాషువ, పి ఆర్.ఓ: వంశీ - శేఖర్.

Vijetha Movie Audio Launched:

Chiranjeevi Son in Law Kalyaan Dhev Audio Release Highlights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs