Advertisement
Google Ads BL

నీహారిక కొణిదెల మరో చిత్రం మొదలైంది!


రాహుల్ విజయ్, నీహారిక కొణిదెల నీర్వాణ సినిమాస్ ప్రొడక్షన్ నెం.1 చిత్రం ప్రారంభం!

Advertisement
CJ Advs

హీరో రాహుల్ విజయ్, మెగా హీరోయిన్ నీహారిక హీరో హీరోయిన్లు గా తెరకెక్కబోతున్న రొమాంటిక్ కామెడి సినిమా ఈరోజు పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. నాగబాబు క్లాప్ కొట్టగా హీరో వరుణ్ తేజ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. 

ఈ సందర్బంగా దర్శకుడు ప్రణీత్ బ్రమనందపల్లి మాట్లాడుతూ.. 'ముద్దపప్పు ఆవకాయ్, నాన్నకూచి' వెబ్ సిరీస్ తరువాత  మొదటిసారి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాను. ఈ నెల 25 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నాము. ఈ సినిమాకు సహకరిస్తున్న అందరికి కృతజ్ఞతలు.. అన్నారు.

హీరో రాహుల్ విజయ్ మాట్లాడుతూ.. డైరెక్టర్ ప్రణీత్ ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు నాకు బాగా నచ్చింది. శేఖర్ కమ్ముల స్టైల్ లో ఈ సినిమా ఉంటుంది. నా మొదటి సినిమా 'ఈ మాయ పేరేమిటో' సొంత నిర్మాణ సంస్థలో చేసాను. కథ నచ్చడంతో బయటి బ్యానర్ లో సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాను. శివాజీ రాజా గారు ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు.. అన్నారు.

నీహారిక కొణిదెల మాట్లాడుతూ... ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ నీర్వాణ సినిమాస్ ఈ సినిమాతో చిత్ర నిర్మాణం మొదలుపెడుతున్నారు. వారికి ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ ప్రణీత్ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. చాలా కొత్తగా తను ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. అందరికి ఈ సినిమా నచ్చుతుంది.. అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజ్ నిహార్ మాట్లాడుతూ... మంచి కథ, కథనాలతో మీ ముందుకు రాబోతున్నాం. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించబోతోంది. డైరెక్టర్ ప్రణీత్ చెప్పిన స్క్రిప్ట్ చాలా బాగుంది. నీహారిక కొణిదెలకు ఈ పాత్ర బాగా సెట్ అవుతుంది.. అన్నారు.

శివాజీరాజా మాట్లాడుతూ.. క్లారిటీ ఉన్న దర్శకుడు ప్రణీత్. గతంలో ప్రణీత్ తో నేను నాన్నకూచి వెబ్ సిరీస్ చేసాను. తను మొదటిసారి సినిమాకు దర్శకత్వం వహించడం అందులో నేను ఒక ముఖ్య పాత్రలో నటించబోతుండడం ఆనందంగా ఉంది.. అన్నారు.

నటీనటులు: రాహుల్ విజయ్, నీహారిక కొణిదెల, శివాజీ రాజా, సత్య, కోటేశ్వర రావ్ తదితరులు.

సాంకేతిక నిపుణులు:

రచన, దర్శకత్వం: ప్రణీత్ బ్రమనదపల్లి

నిర్మాత: సందీప్ యర్మారెడ్డి, సుజన్ యారబోలు, రామ్ నరేష్

కెమెరామెన్: హరిజ్ ప్రసాద్

మ్యూజిక్: మార్క్ కె రాబిన్

ఎడిటర్: రవితేజ గిరిజాల

ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్ల

లిరిక్స్: కృష్ణకాంత్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాజ్ నిహార్

కో డైరెక్టర్: దాసం ప్రసాద్

పి. ఆర్.ఓ: వంశీ - శేఖర్

పబ్లిసిటీ: అనిల్ & భాను

కాస్టూమ్ డిజైనర్: భార్గవి అంబటి, గౌరీ నాయుడు.

Niharika and Rahul Vijay starring Nirvana Cinemas Production No 1 Launch:

Niharika New Film with Rahul Vijay Launched
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs