Advertisement
Google Ads BL

అభిమన్యుడు సూపర్‌గా ఉంది: నితిన్!


మాస్ హీరో విశాల్ హీరో గా సమంత, యాక్షన్ కింగ్ అర్జున్ ముఖ్య పాత్రల్లో పి.ఎస్. మిత్రన్ ని దర్శకునిగా పరిచయం చేస్తూ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ, హరి వెంకటేశ్వర పిక్చర్స్ సంయుక్తంగా జి.హరి నిర్మాతగా నిర్మించిన చిత్రం 'అభిమన్యుడు'. సైబర్ నేరాల వంటి ఆసక్తికరమైన అంశంతో ఉత్కంఠభరితంగా తెరకెక్కిన 'అభిమన్యుడు' విశాల్ కెరీర్ లో నే బిగ్గెస్ట్ సూపర్ హిట్ గా నిలిచింది. 18 రోజులకి 18,15,72,548 గ్రాస్ వసూలు చేసి మూడవ వారంలో కూడా దిగ్విజయంగా ప్రదర్శింపబడుతోంది.

Advertisement
CJ Advs

'అభిమన్యుడు'  మంచి వసూళ్ళతో పాటు, అనేక మంది సెలెబ్రిటీల ప్రశంసలూ దక్కించుకోవడం విశేషం. తాజాగా యూత్ స్టార్ నితిన్ 'అభిమన్యుడు' ని ప్రశంసించారు. ఆయన అభిప్రాయాన్ని ప్రత్యేకంగా ట్విట్టర్ లో పంచుకున్నారు.....'అభిమన్యుడు' ని చూసాను. నాకు చాలా బాగా నచ్చింది. విశాల్, అర్జున్ సార్, సమంతల నటన, దర్శకుడు పి.ఎస్. మిత్రన్ అద్భుతమైన స్క్రిప్ట్ తో పాటు ఉత్కంఠ రేపే స్క్రీన్ ప్లే తో ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. నిర్మాత హరికి, చిత్ర బృందానికి అభినందనలు'

దీనికి మాస్ హీరో విశాల్ స్పందిస్తూ,  'థాంక్స్ బ్రదర్. నీకు సినిమా నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది' అని స్పందించారు. యువ నిర్మాత జి.హరి మాట్లాడుతూ, 'అభిమన్యుడు' ని అభినందించిన యూత్ స్టార్ నితిన్ కి కృతజ్ఞతలు. 18 రోజులకి 18 కోట్లు వసూలు చేసి విశాల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మూడవ వారంలో కూడా మంచి కలెక్షన్స్ సాధించడం  ఆనందంగా ఉంది.' అన్నారు.

I Liked 'Abhimanyudu' A Lot - Youth Star Nithiin:

Nithiin Praises Vishal Abhimanyudu Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs