Advertisement
Google Ads BL

'అభిమన్యుడు'పై మహేష్‌ ప్రశంసలు!!


మాస్‌ హీరో విశాల్‌, హ్యాట్రిక్‌ హీరోయిన్‌ సమంత యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ప్రధాన పాత్రల్లో విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ, హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బ్యానర్స్‌ పై ఎమ్‌. పురుషోత్తమ్‌ సమర్పణలో పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో యువ నిర్మాత జి. హరి నిర్మించిన 'అభిమన్యుడు' చిత్రం సంచలన విజయం సాధించి మూడో వారంలో కూడా మంచి కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ఈ చిత్రాన్ని వీక్షించిన సూపర్‌స్టార్‌ మహేష్‌ 'అభిమన్యుడు'ని తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా ప్రశంసించారు. 'అభిమన్యుడు' చిత్రం చాలా బాగా నచ్చింది. తన విజన్‌ని దర్శకుడు పి.ఎస్‌.మిత్రన్‌ ప్రతిభావంతంగా తెరకెక్కించారు. ఎంతో రిసెర్చ్‌తో, వేగవంతమైన చిత్రణతో తెరకెక్కిన 'అభిమన్యుడు' ఎంతో ఆకట్టుకుంది. విశాల్‌కి, చిత్ర బృందానికి అభినందనలు.. అని పోస్ట్‌ చేశారు సూపర్‌స్టార్‌ మహేష్‌. 

Advertisement
CJ Advs

18 రోజులకు 18 కోట్లకి పైగా వసూళ్ళతో దూసుకెళ్తున్న 'అభిమన్యుడు' - యువ నిర్మాత జి.హరి 

మాస్‌ హీరో విశాల్‌ మాట్లాడుతూ.. మంచి చిత్రాలను ప్రోత్సహించే సూపర్‌స్టార్‌ మహేష్‌ మా 'అభిమన్యుడు'ని ప్రశంసించడం చాలా ఆనందంగా ఉంది. ఆయనకి థాంక్స్‌.. అన్నారు. 

యువ నిర్మాత గుజ్జల పూడి హరి మాట్లాడుతూ.. సూపర్‌స్టార్‌ మహేష్‌గారు మా 'అభిమన్యుడు'ని అభినందించడంతో పాటూ టీం అందరినీ ప్రశంసించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా సూపర్‌స్టార్‌ మహేష్‌కి కృతజ్ఞతలు. 18 రోజులకు 18,15,72,548 గ్రాస్‌ కలెక్ట్‌ చేసి మూడో వారంలో కూడా 'అభిమన్యుడు' సూపర్‌ కలెక్షన్స్‌తో ప్రదర్శింపబడడం ఎంతో ఆనందంగా ఉంది. మా చిత్రాన్ని మహేష్‌ ప్రశంసించడం మా టీమ్‌కి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది.. అన్నారు. 

Mahesh heaps praises on Abhimanyudu:

Mahesh Babu Speaks High On Abhimanyudu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs