Advertisement
Google Ads BL

అంజలి మళ్లీ భయపెట్టడానికి రెడీ అవుతోంది!


అంజలి టైటిల్ పాత్ర‌లో కోన పిలిమ్ కార్పొరేష‌న్‌, ఎం.వి.వి. సినిమా కాంబినేష‌న్‌లో 'గీతాంజ‌లి 2'

Advertisement
CJ Advs

ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎం.వి.వి. సినిమా బ్యాన‌ర్‌పై రూపొందిన హార‌ర్ కామెడీ చిత్రం 'గీతాంజ‌లి' సెన్సేష‌న‌ల్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. కోన వెంక‌ట్‌, ఎం.వి.వి.సినిమా హార‌ర్ కామెడీ జోన‌ర్‌లో 'గీతాంజ‌లి'తో స‌క్సెస్ సాధించ‌డ‌మే కాదు.. స‌రికొత్త ట్రెండ్ క్రియేట్ చేయ‌డమే కాక.. విజ‌య‌వంత‌మైన ప‌లు హార‌ర్ కామెడీ చిత్రాల‌కు నాంది ప‌లికారు. అలాగే కోన వెంకట్ స్థాపించిన నిర్మాణ సంస్థ కోన పిలిమ్ కార్పొరేష‌న్‌(KFC) బ్యాన‌ర్‌లో వ‌చ్చిన అభినేత్రి, నిన్ను కోరి చిత్రాలతో విజయాలు సాధించింది. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ సాదించే దిశ‌గా అడుగులు వేస్తుంది. ఇలా రెండు విజ‌య‌వంత‌మైన సంస్థ‌లు కల‌యిక‌లో ఆది పినిశెట్టి, తాప్సీ, రితిక‌సింగ్ ప్ర‌ధాన తారాగ‌ణంగా 'నీవెవ‌రో' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ  చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. 

వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో సినిమాలు చేస్తున్న ఈ రెండు నిర్మాణ సంస్థ‌లు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మ‌రో చిత్రం 'గీతాంజ‌లి 2'. ప్రముఖ న‌టి అంజ‌లి టైటిల్ రోల్‌లో న‌టిస్తున్నారు. స్టార్ డాన్స్ మాస్ట‌ర్‌, హీరో, డైరెక్ట‌ర్ ఇలా అన్ని విభాగాల్లో త‌న‌దైన ప్ర‌తిభను నిరూపించుకున్న ఇండియ‌న్ మైకేల్ జాక్స‌న్ ప్ర‌భుదేవా ఈ సినిమా వివ‌రాల‌ను త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేసి యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు. త్వరలో మొదలు కానున్న ఈ చిత్రానికి భారతీయ సంతతి కి చెందిన ఒక అమెరికన్ దర్శకత్వం వహించనున్నారు. 

ఈ చిత్రం థ్రిల్ల‌ర్ కామెడీ జోన‌ర్‌లో రూపొంద‌నుంది. త్వర‌లోనే  మ‌రిన్ని వివరాలను తెలియ చేస్తామని చిత్ర నిర్మాతల్లో ఒకరైన కోనవెంకట్ తెలిపారు. 

Geethanjali 2 First Look:

MVV Cinema and KFC Announce Geethanjali-2 is their next film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs