Advertisement
Google Ads BL

అల్లుడు కోసం చిరంజీవి వస్తున్నాడు..!


మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కించిన చిత్రం ఫస్ట్‌లుక్ విడుదల అయ్యింది. రాకేష్ శశి దర్శకత్వంలో వారాహి చలన చిత్రం పతాకంపై నిర్మిస్తున్న సినిమా 'విజేత'.  కళ్యాణ్ దేవ్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం టీజర్ రేపు (జూన్ 12) ఉదయం 8.59 గంటలకు విడుదల చేయబోతున్నారు. టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఇటీవల విడుదలైన విజేత  ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. జులై మొదటి వారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
CJ Advs

విజేత చిత్ర నిర్మాతలు ఆడియో విడుదల తేదీని ఖరారు చెయ్యడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా జూన్ 24న భారీ స్థాయిలో  'విజేత' ఆడియో ఫంక్షన్ జె.ఆర్.సి కన్వెన్షన్ లో జరగబోతోంది. చిత్ర పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు. బాహుబలి కెమెరామెన్ కె.కె.సెంథిల్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూర్చారు. వారాహి చలన చిత్రం బ్యానర్ లో సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో మురళి శర్మ  ముఖ్యపాత్రలో నటించడం జరిగింది.

నటీనటులు:

కళ్యాణ్ దేవ్, మాళవిక నాయర్, తనికెళ్ళ భరణి, మురళి శర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పృథ్వి, రాజీవ్ కనకాల, జయ ప్రకాష్ (తమిళ్), ఆదర్శ్ బాలకృష్ణ, నోయల్, కిరీటి, భద్రం, సుదర్శన్, మహేష్ విట్టా.

సాంకేతిక నిపుణులు: కథ,స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: రాకేష్ శశి, నిర్మాత: రజిని కొర్రపాటి, సాయి కొర్రపాటి ప్రొడక్షన్, ప్రెజెంటర్: సాయి శివాని, కెమెరామెన్: కె.కె.సెంథిల్, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, సాహిత్యం: రెహమాన్, రామజోగయ్య శాస్త్రి, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణ, స్టంట్స్: జాషువ, పీ. ఆర్.ఓ: వంశీ - శేఖర్.

Megastar Chiranjeevi to Grace Vijetha Audio launch:

Chiranjeevi son in law Movie Latest Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs