Advertisement
Google Ads BL

'అభిమన్యుడు' తడాఖా చూపిస్తున్నాడు!


7 రోజుల్లోనే 12 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసి విశాల్‌ కెరీర్‌ణలోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది మా 'అభిమన్యుడు' - నిర్మాత గుజ్జలపూడి హరి 

Advertisement
CJ Advs

మాస్‌ హీరో విశాల్‌, హ్యాట్రిక్‌ హీరోయిన్‌ సమంత, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ప్రధాన పాత్రల్లో విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ, హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బేనస్స్‌పై ఎమ్‌. పురుషోత్తమ్‌ సమర్పణలో యువ నిర్మాత జి. హరి నిర్మించిన 'అభిమన్యుడు' గతవారం విడుదలై సూపర్‌ టాక్‌తో సూపర్‌ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. 

ఈ ఘన విజయంపై నిర్మాత గుజ్జలపూడి హరి మాట్లాడుతూ.. కేవలం 7 రోజుల్లోనే 12 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసి విశాల్‌గారి కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది మా 'అభిమన్యుడు'. రెండోవారం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో 261 థియేటర్స్‌లో హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో రన్‌ అవుతోంది. ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా ఆన్‌లైన్‌ మోసాలు ఎలా జరుగుతున్నాయో కళ్ళకు కట్టినట్లు దర్శకులు పి.ఎస్‌. మిత్రన్‌ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. నిజ జీవితంలో విశాల్‌ వ్యక్తిత్వానికి దగ్గరగా ఈ చిత్రంలోని హీరో పాత్ర వుండడంతో విశాల్‌ చాలా నేచురల్‌గా చేసిన పెర్‌ఫార్మెన్స్‌ సినిమాని పెద్ద రేంజ్‌కు తీసుకెళ్ళింది. వరస విజయాలతో ప్రేక్షకుల ప్రశంసల్ని అందుకుంటున్న సమంత ఈ చిత్రానికి పెద్ద ప్లస్‌ పాయింట్‌ అయింది. అలాగే యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ పోషించిన నెగిటివ్‌ రోల్‌ చిత్రానికి మంచి గ్రిప్‌ తీసుకొచ్చింది. యువన్‌ శంకర్‌ రాజా రీరికార్డింగ్‌ ఆడియన్స్‌కి చాలా థ్రిల్‌ ఇచ్చింది. అన్ని విధాలుగా సినిమా ఎక్స్‌ట్రార్డినరీగా వుందన్న అనుభూతి ప్రేక్షకులకు కలిగినందువలనే 7 రోజుల్లోనే 12 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసింది. రెండోవారం కూడా అన్నీ థియేటర్స్ ఫుల్ అవుతూ రన్‌ అవడం చాలా ఆనందంగా వుంది. మా హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బేనర్‌కి ఇంత పెద్ద హిట్‌ ఇచ్చిన విశాల్‌గారికి, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.. అన్నారు. 

'అభిమన్యుడు' 7 రోజుల గ్రాస్‌ కలెక్షన్‌!! 

నైజాం-4,37,52,661 

సీడెడ్‌-99,85,861 

వైజాగ్‌-1,50,02,989 

నెల్లూరు-50,63,222 

ఈస్ట్‌-72,35,797 

వెస్ట్‌-46,41,397 

కృష్ణా-1,03,97,414 

గుంటూరు-77,09,345 

కర్ణాటక-49,00,000 

ఒరిస్సా - నార్త్‌ ఇండియా-24,00,000

ఓవర్సీస్‌-91,00,000 

7 రోజుల టోటల్‌- 12,01,88,686

Abhimanyudu First Week Collections:

Producer Hari Happy with Abhimanyudu Collections
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs