Advertisement
Google Ads BL

శివ జొన్నలగడ్డ కోసం శిష్య బృంద ప్రయత్నం!


శివ జొన్నలగడ్డ హీరోగా లైం లైట్‌ ప్రొడక్షన్స్‌ కొత్త చిత్రం ప్రారంభం!

Advertisement
CJ Advs

శివ జొన్నలగడ్డ  హీరోగా లైం లైట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై శ్రీమతి వసుంధర సమర్పణలో ప్రొడక్షన్‌ నెం-1 గా ఓ చిత్రం రూపొందుతుంది. టీ. రమేష్  నిర్మిస్తోన్న ఈ చిత్రం ద్వారా సురేష్‌ రెడ్డి అక్కల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సభ, లిఖిద హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం శుక్రవారం ఫిల్మ్ చాంబర్‌ లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జూబ్లిహిల్స్‌ కార్పొరేటర్‌ కాజా సూర్యనారాయణ తొలి సన్నివేశానికి క్లాప్‌నివ్వగా ‘పోలీస్‌ పవర్‌’ నిర్మాత గుద్దేటి బసవప్ప కెమెరా స్విచాన్‌ చేశారు. ప్రసన్నకుమార్‌ గౌరవ దర్శకత్వం వహించారు. 

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో హీరో శివ జొన్నలగడ్డ మాట్లాడుతూ... 'నా చిత్రాలకు దర్శకత్వశాఖలో పనిచేసిన నా శిష్య బృందం అంతా కలిసి నాతో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌గా ఓ పవర్‌ ఫుల్‌ పాత్రలో నటిస్తున్న యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఆకట్టుకునే విధంగా ఉంటాయని' అన్నారు.

దర్శకుడు సురేష్‌ రెడ్డి అక్కల  మాట్లాడుతూ... 'డైరెక్టర్‌గా నా తొలి సినిమా ఇది. క్రైమ్‌, లవ్‌, రొమాన్స్‌ తో కూడిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. ఈ నెల రెండో వారంలో షూటింగ్ స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో, సెకండ్ షెడ్యూల్ బెంగళూరులో చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అన్నారు.

ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ.. 'జొన్నలగడ్డ శివ వరుసగా సినిమాలు తీస్తూ.. తన చిత్రాల ద్వారా ఎంతో మంది నూతన కళాకారులను పరిచయం చేస్తున్నాడు. తన శిష్య బృందం అంతా కలిసి చేస్తోన్న ఈ ప్రయత్నం ఫలించాలని..' అన్నారు.

'పోలీస్‌ పవర్‌' నిర్మాత గుద్దేటి బసవప్ప మాట్లాడుతూ.. 'జొన్నలగడ్డ శివ వరుస చిత్రాలతో ముందుకెళ్తున్నాడు. తన శిష్య బృందం నిర్మిస్తోన్న  ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను..' అన్నారు.

Siva Jonnalagadda Movie Launched:

Lime Light Productions no 1 Movie Launched
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs