యువహీరో తాజాగా నటిస్తోన్న సినిమా ‘ముద్ర’. ‘ఠాగూర్’ మధు సమర్పిస్తున్న ఈ సినిమాను ఆరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, మూవీ డైనమిక్స్ ఎల్.ఎల్.పి. బ్యానర్‌లపై కార్య వేణుగోపాల్, రాజ్‌కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిఖిల్ పుట్టినరోజు సంధర్బంగా విడుదల చేసిన ముద్ర ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్ లభించింది. నిఖిల్ ఈ చిత్రంలో రిపోర్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఫస్ట్ లుక్ లో నిఖిల్ తన చేతిలో కెమెరాతో కనిపించాడు. జర్నలిజం లో జరిగే కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా చిత్రీకరించడం జరుగుతోంది.
టి.ఎన్. సంతోష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి నిఖిల్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శ్యాం సి.ఎస్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు సూర్య కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నారు.