Advertisement
Google Ads BL

ఆకాష్‌ని అలా అంటుంటే ఆనందంగా ఉంది: పూరి!


పూరి ఆకాష్‌ను హీరోగా పరిచయం చేస్తూ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ రూపొందించిన డిఫరెంట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'మెహబూబా'. శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై పూరి కనెక్ట్స్‌ నిర్మాణంలో రూపొందిన 'మెహబూబా' ఇటీవల విడుదలై భారీ ఓపెనింగ్స్‌తో, సూపర్‌హిట్‌ టాక్‌తో దిగ్విజయంగా ప్రదర్శింపబడుతోంది. ఈ నేపథ్యంలో మే 15న హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో థాంక్స్‌ మీట్‌ను నిర్వహించింది చిత్ర యూనిట్‌. ఈ థాంక్స్‌ మీట్‌లో హీరో ఆకాష్‌ పూరి, హీరోయిన్‌ నేహాశెట్టి, డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, ఛార్మి, నటులు విషురెడ్డి, విజయ్‌, పృథ్వీ, ఎడిటర్‌ జునైద్‌ సిద్ధిఖీ, ఆర్ట్‌ డైరెక్టర్‌ జానీ షేక్‌ పాల్గొన్నారు. 

Advertisement
CJ Advs

ఛార్మి మాట్లాడుతూ.. సినిమాకి అన్ని ఏరియాల నుంచి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. సినిమాని ఇంత పెద్ద హిట్‌ చేసిన ఆడియన్స్‌కి థాంక్స్‌. ఈ సినిమాకి అందరూ చాలా మంచి సపోర్ట్‌ అందించారు. ఇలాంటి సినిమాను థియేటర్స్‌లోనే చూడాలి. ఎందుకంటే సినిమాలోని విజువల్స్‌ని, సౌండ్‌ ఎఫెక్ట్స్‌ని ఎంజాయ్‌ చెయ్యాలంటే బిగ్‌ స్క్రీన్‌లోనే సాధ్యమవుతుంది. కాబట్టి అందరూ థియేటర్స్‌కి వెళ్ళి 'మెహబూబా'ను చూడండి.. అన్నారు. 

విషురెడ్డి మాట్లాడుతూ.. మా మెహబూబా సినిమా చాలా సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఈ సినిమాని సూపర్‌హిట్‌ చేసి తెలుగు సినిమా సత్తాని చూపిన ప్రేక్షకులకు థాంక్స్‌. సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. మ్యూజిక్‌ అద్భుతంగా చేశారు. ఆకాష్‌ యాక్టింగ్‌ ఎక్స్‌లెంట్‌గా చేశారు. ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి ఈ సినిమా చేశారు. మమ్మల్ని సపోర్ట్‌ చేస్తున్న అందరికీ థాంక్స్‌.. అన్నారు. 

పృథ్వీ మాట్లాడుతూ.. నాలాంటి కొత్త ఆర్టిస్టులకు పూరి సర్‌లాంటి డైరెక్టర్‌ చేసే సినిమాలో నటించాలని వుంటుంది. ఈ సినిమాకి సంబంధించి చాలా మంది కొత్తవారికి అవకాశం ఇచ్చారు. ఆర్టిస్టుల్నే కాదు టెక్నీషియన్స్‌ని కూడా పరిచయం చేశారు.. అన్నారు. 

జునైద్‌ సిద్ధిఖీ మాట్లాడుతూ.. ఈ సినిమాకి మా రిలేటివ్స్‌ అయిన కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్‌ని తీసుకెళ్ళాను. వాళ్ళు సినిమా బాగుందని మరికొంతమందికి చెప్పడం, వాళ్ళు ఇంకొంతమందికి చెప్పడం.. ఇలా మౌత్‌ టాక్‌తో రోజురోజుకీ 'మెహబూబా' స్ట్రాంగ్‌ అవుతోంది. మా సినిమాని ఇంత పెద్ద హిట్‌ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు.. అన్నారు. 

జానీ షేక్‌ మాట్లాడుతూ.. మెహబూబా బ్యూటిఫుల్‌ లవ్‌ స్టోరీ. యూత్‌కే కాకుండా అన్ని ఏజ్‌ల వారికి బాగా నచ్చుతోంది. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ మంచి అప్రిషియేషన్‌ లభిస్తోంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన పూరి సర్‌కి, ఛార్మీ మేడమ్‌కి స్పెషల్‌ థాంక్స్‌..అన్నారు. 

నేహాశెట్టి మాట్లాడుతూ.. ప్రేక్షకులందరికీ థాంక్స్‌ ఈ సినిమాని పెద్ద హిట్‌ చేసినందుకు. ఆకాష్‌ మంచి కోస్టార్‌. చాలా అద్భుతంగా చేశారు. విషు ఇందులో విలన్‌గా మంచి పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చారు. పూరిగారు ఒక మంచి లవ్‌స్టోరీని రూపొందించారు. రెగ్యులర్‌ సినిమాలకు భిన్నంగా ఉండే సినిమాలు చూడాలనుకునేవారికి 'మెహబూబా' తప్పకుండా నచ్చుతుంది..అన్నారు. 

విజయ్‌ మాట్లాడుతూ..ఈ సినిమాలో చాలా ఫ్లాష్‌ బ్యాక్‌ సీన్స్‌ ఉంటాయి. సినిమా చూస్తున్నంత సేపూ మీరు కూడా ఫ్లాష్‌ బ్యాక్‌లోకి వెళ్ళిపోతారు. సినిమాని చాలా ఎంజాయ్‌ చేస్తారు.. అన్నారు. 

పూరి ఆకాష్‌ మాట్లాడుతూ..సినిమాకి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. చూసినవాళ్ళంతా చాలా బాగుందని చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ సినిమాని ఎంతో ఇష్టంగా చేశారు. నాకు ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు నాన్నకి థాంక్స్‌. ఆ పదం చాలా చిన్నదని నా ఒపీనియన్‌. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు.. అన్నారు. 

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ..అమెరికాలో తెలుగు వాళ్ళ మధ్య కూర్చొని ప్రీమియర్‌ చూశాం. అందరికీ బాగా నచ్చింది. హైదరాబాద్‌లో థియేటర్‌లో ప్రేక్షకుల మధ్య కూర్చొని చూశాం. చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. నాలుగోసారి, ఐదోసారి చూసిన వాళ్ళను కూడా నేను కలిశాను. ఆకాష్‌ని బాగా అప్రిషియేట్‌ చేస్తున్నారు. రెగ్యులర్‌గా నేను తీసే సినిమాల్లా ఉండదు. కమర్షియల్‌ సాంగ్స్‌, ఐటమ్‌ సాంగ్స్‌ వంటివి లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసే లవ్‌స్టోరీ చేశాను. నా కెరీర్‌లో నేను బాగా మనసు పెట్టి తీసిన సినిమా ఇది. ఫ్యామిలీతో కలిసి అందరూ చూడండి. మా సినిమాకి పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్‌.. అన్నారు. 

Mehbooba Thanks Meet Details:

Puri Jagannadh Happy with Mehbooba Success 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs