Advertisement
Google Ads BL

'మెహబూబా' సెన్సార్‌ టాక్..!


డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఆకాష్‌ పూరి హీరోగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై పూరి కనెక్ట్స్‌ నిర్మిస్తున్న చిత్రం 'మెహబూబా'. మే 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలవుతోంది. హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు... శ్రీ వెంకటేశ్వర ఫిలింస్‌ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. కాగా, ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. 

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా ఛార్మి మాట్లాడుతూ.. మా సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. సెన్సార్‌ సభ్యులందరికీ సినిమా చాలా బాగా నచ్చిందని చెప్పారు. ఆకాష్‌ చాలా బాగున్నాడు, లవ్‌ స్టోరీ చాలా బాగుంది అని పదే పదే చెప్పడంతో మాకు చాలా ఎనర్జీ వచ్చింది. సినిమాపై మరింత కాన్ఫిడెన్స్‌ వచ్చింది. ఈ సందర్భంగా సెన్సార్‌ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మే 11న ప్రపంచవ్యాప్తంగా మా 'మెహబూబా' చిత్రాన్ని విడుదల చేస్తున్నాం.. అన్నారు. 

పూరి ఆకాశ్‌ సరసన నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సందీప్‌ చౌతా, సినిమాటోగ్రఫీ: విష్ణుశర్మ, ఎడిటింగ్‌: జునైద్‌ సిద్ధిఖీ, యాక్షన్‌: రియల్‌ సతీష్‌, ఆర్ట్‌: జానీ షేక్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, నిర్మాత, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌. 

Mehbooba Censor Talk:

Charmi about Mehbooba Censor Talk
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs