దేశదిమ్మరి గా తనీష్!!
>యంగ్ హీరో తనీష్ దేశదిమ్మరి గా ముస్తాబౌతున్నాడు. సవీన క్రియేషన్స్ పతాకంపై నగేష్ నారదాసి దర్శకత్వంలొ స్వతంత్ర గోయల్ (శావి USA) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దేశదిమ్మరిలో తనీష్ కు జోడీగా షరీన్ హీరోయిన్ గా నటిస్తోంది. సమ్మర్ కానుకగా విడుదలకు ముస్తాబౌతున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాల్ని జరుపుకుంటోంది . ఈ చిత్రంతో తనీష్ తనలోని గాయకుడిని మనకు పరిచయం చేస్తున్నాడు. హే పైసా అంటూ డబ్బు పై వచ్చే ఓ సెటైరికల్ సాంగ్‌ని తనీష్ స్వయంగా ఆలపించాడు. ఈ చిత్రాన్ని పంజాబ్ , హిమాచల్ ప్రదేశ్ , హర్యానా, సిమ్లా వంటి అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించారు. దేశదిమ్మరి చిత్రానికి సుభాష్ ఆనంద్ అందించిన సంగీతం , ప్రదీష్ ఆంటోని కొరియోగ్రఫీ రెండు హైలైట్ గా ఉంటాయని చిత్ర దర్శకుడు నగేష్ నారదాసి చెప్పారు.
Advertisement
CJ Advs
>పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ముస్తాబౌతున్న తమ దేశదిమ్మరి చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని,
>చిత్రీకరణ పూర్తి చెసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటోందని. సమ్మర్ లొనె ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని నిర్మాత తెలిపారు.
>ఈ చిత్రానికి నందమూరి హరి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా , మల్లిఖార్జున్ సినిమాటోగ్రఫీని అందించారు.
Tanish In And As Desa Dhimmari:
<span>Young hero Tanish is all set to enthrall us as Desa Dhimmari</span>
Show comments
Advertisement
Google Ad amp 3
CJ Ads
Advertisement
Google Ad amp 3
CJ Ads