Advertisement
Google Ads BL

‘ఊ.పె.కు.హ’ రిలీజ్ డేట్ ఫిక్స్..!


80 మంది కమెడియన్స్ తో ఏప్రిల్ 27 న నవ్వించడానికి వస్తున్న ‘ఊ.పె.కు.హ’

Advertisement
CJ Advs

రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో బేబీ లక్ష్మీ నరసింహ హిమ ఋషిత సమర్పణలో జెబి క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి భాగ్యలక్ష్మి నిర్మించిన సినిమా ‘ఊ.పె.కు.హ’. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి అనేది కాప్షన్. సాక్షీ చౌదరి కథానాయిక. ‘నిధి’ ప్రసాద్ దర్శకుడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఇటీవల విడుదలై మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 27 న వచ్చేందుకు రెడీ అవుతుంది. 

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ… ‘దర్శకులు నిధి ప్రసాద్‌ గారు సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు అంతా బాగా సహకరించారు. సినిమా చాలా బాగా వచ్చింది. అందరినీ అలరించే చిత్రమవుతుంది’ అన్నారు. 

దర్శకుడు నిధి ప్రసాద్‌ మాట్లాడుతూ… ' సినిమా అనుకున్న దానికంటే కూడా చాలా బాగా వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. రాజేంద్రప్రసాద్ గారి నటన ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. అలాగే అనూప్ సంగీతం మరో హైలైట్. సినిమాలో నటించిన నటీనటులందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు. అలాగే సాంకేతిక నిపుణులు కూడా ఎంతగానో సహకరించారు. ఏప్రిల్ 27 న హడావుడి మొదలవుతుంది. ప్రేక్షకులందరికీ నచ్చే సినిమా అవుతుంది..' అని అన్నారు.

రాజేంద్రప్రసాద్, సాక్షి చౌదరి, బ్రహ్మనందం, ఆలీ, కృష్ణుడు, ఋషి, హేమంత్, సాయి, ధనరాజ్, కృష్ణ భగవాన్ మొదలగు భారీ తారాగణం నటించిన ఈ చిత్రానికి.. డిఓపి: వాసు, ఎడిటర్: శంకర్, ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి.ఆర్. నాగరాజు, ఆర్ట్: విజయ్ కృష్ణ, సంగీతం: అనూప్ రూబెన్స్, ప్రొడ్యూసర్: శ్రీమతి భాగ్యలక్ష్మి, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: నిధి ప్రసాద్  

OOPEKUHA Movie Release Date Pix:

OOPEKUHA Movie Release on April 27th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs