Advertisement
Google Ads BL

జూన్‌లో రానున్న ‘RX 100’..!


రామ్‌గోపాల్ వ‌ర్మ శిష్యుడు అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయ‌, పాయ‌ల్ రాజ్‌పుత్ జంట‌గా అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ నిర్మించిన‌ `RX 100` జూన్‌లో విడుద‌ల‌!

Advertisement
CJ Advs

రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ సౌండ్ ఎక్క‌డ వినిపించినా గుండెల్లో గుబులు పుట్టించే విల‌న్ గుర్తొస్తాడు. స్కూటీ.. అన‌గానే చ‌లాకీగా న‌వ్వుతూ, చ‌క్క‌గా తుళ్లుతూ తిరిగే అంద‌మైన  అమ్మాయి గుర్తుకొస్తుంది. ప‌ల్స‌ర్.. అన‌గానే జ‌ర్‌... జ‌ర్‌.. అంటూ దూసుకుపోయే త‌త్వం ఉన్న కొంటె కుర్రాడు అల్లరిగా క‌న్నుగీటుతున్న‌ట్టు ఉంటుంది.  వీట‌న్నిటిలాగే `RX 100`కీ ఓ ప్ర‌త్యేక‌త ఉంది. ఆ పేరు చెప్ప‌గానే యారొగెంట్ కేరక్ట‌ర్‌ గుర్తుకొస్తుంది. నిజ‌మే... `RX 100` సౌండే డిఫ‌రెంట్‌గా ఉంటుంది. RX 100 బైక్ ఒక జ‌న‌రేష‌న్‌కి ఫేవ‌రేట్ బైక్‌. మాస్‌ని అమితంగా ఆక‌ట్టుకున్న బైక్‌. మ‌రి... అంత మందిని ఆక‌ట్టుకున్న ఆ బైక్ పేరు మా సినిమాకు ఎందుకు పెట్టాం? అనేది తెలుసుకోవాలంటే జూన్ వ‌ర‌కు ఆగాల్సిందే... అని అంటున్నారు ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి. KCW  బ్యానర్ పై  అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ నిర్మిస్తున్న‌ `RX 100`  చిత్రానికి అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి. ( An Incredible Love Story ) అనేది ఈ చిత్రానికి ఉప‌శీర్షిక‌.   కార్తికేయ, పాయల్ రాజపుత్‌  హీరోహీరోయిన్లు. రావురమేష్, సింధూర పువ్వు రామ్‌కీ ఇందులో కీలక  పాత్రధారులు.  

దర్శ‌కుడు అజ‌య్ భూప‌తి మాట్లాడుతూ... అత్యున్న‌త‌మైన భావోద్వేగాల‌తో క‌థ‌ను తీర్చిదిద్దాం. ఓ చిన్న టౌన్ నేప‌థ్యంలో క‌థ న‌డుస్తుంది. రియ‌లిస్టిక్ ల‌వ్ స్టోరీ ఇది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను త‌ప్ప‌కుండా ఆక‌ట్టుకుంటుంది. టైటిల్‌కి, పోస్ట‌ర్స్ కి మంచి స్పందన వ‌స్తోంది. పాట‌లు ప‌దే ప‌దే పాడుకునేలా ఉంటాయి.. అని చెప్పారు.

నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ మాట్లాడుతూ... మా చిత్రానికి క‌థే హైలైట్‌. క‌థ‌కు త‌గ్గ విధంగా ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా సినిమాను తెర‌కెక్కించాం. సినిమా చూసిన వారంద‌రూ నిర్మాణ విలువ‌ల‌ను మెచ్చుకుంటారు. అన్నీ హంగులున్న చ‌క్క‌టి క‌మ‌ర్షియ‌ల్ చిత్ర‌మిది.  ఈస్ట్ గోదావ‌రిలో రెండు షెడ్యూళ్ల‌లో షూటింగ్ పూర్తి చేశాం. మొత్తం ఏడు పాట‌లుంటాయి. ఇంకా ఒక్క పాటను చిత్రీక‌రించాల్సి ఉంది. జూన్‌లో  చిత్రాన్ని విడుద‌ల చేస్తాం. నేషనల్ అవార్డు విన్నర్ ప్రవీణ్. కే.ఎల్ ( 'కబాలి' ఫేమ్ ) ఈ చిత్రానికి ఎడిటర్ గా పనిచేస్తున్నారు.  తెలుగులో ఆయనకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం.. అని తెలిపారు. 

నటీనటులు: కార్తికేయ, పాయల్ రాజపుత్‌, రావు రమేష్, రాంకీ ( సింధూర పువ్వు ఫేమ్ ), సత్య, గిరిధర్, లక్ష్మణ్ త‌దిత‌రులు. సాంకేతిక  వర్గం: మ్యూజిక్: చైతన్ భరద్వాజ్ ,లిరిక్స్: శ్రీమణి , చైతన్య ప్రసాద్, సిరాశ్రీ, కొరియోగ్రఫీ:స్వర్ణ, అజయ్, సురేష్ వర్మ, స్టంట్స్:  రియల్ సతీష్ ,  ఆర్ట్ డైరెక్టర్: రఘు కులకర్ణి, ఎడిటర్: ప్రవీణ్. కే .ఎల్ ( కబాలి ఫేమ్ ),  సినిమాటోగ్రఫీ: రామ్, పబ్లిసిటీ డిజైనర్: ఈశ్వర్ అందే, ఎగ్జిక్యూటివ్: సూర్య నారాయణ, నిర్మాత: అశోక్ రెడ్డి గుమ్మకొండ , రచన-దర్శకత్వం: అజయ్ భూపతి.

RX 100 movie Release in June:

RX 100 Movie Latest Update  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs