Advertisement
Google Ads BL

ఏప్రిల్‌ 7న భరత్‌ బహిరంగ సభ


సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై స్టార్‌ ప్రొడ్యూసర్‌ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న భారీ చిత్రం 'భరత్‌ అనే నేను'. ఈ చిత్రం ఏప్రిల్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు రెండు పాటలు విడుదలయ్యాయి. 'భరత్‌ అనే నేను' టైటిల్‌ సాంగ్‌, 'ఐ డోంట్‌ నో' పాటలకు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో సూపర్‌స్టార్‌ మహేష్‌ ముఖ్యమంత్రిగా కనిపిస్తారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ 'భరత్‌ బహిరంగ సభ' పేరుతో ఏప్రిల్‌ 7 సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని ఎల్‌.బి. స్టేడియంలో ప్రేక్షకులు, అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరగనుంది. 

Advertisement
CJ Advs

సూపర్‌స్టార్‌ మహేష్‌, హీరోయిన్‌ కైరా అద్వాని, ప్రకాష్‌రాజ్‌, శరత్‌ కుమార్‌లతోపాటు ప్రముఖ తారాగణం నటిస్తున్న  ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్‌, ఎస్‌.తిరునవుక్కరసు, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, సమర్పణ: శ్రీమతి డి.పార్వతి, నిర్మాత: దానయ్య డి.వి.వి., దర్శకత్వం: కొరటాల శివ. 

Mahesh Babu Bharat Ane Nenu Pre Release Event Update:

Bharat Ane Nenu Pre Release Event on April 7
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs