Advertisement
Google Ads BL

సుమంత్ చిత్రం 'ఇదం జగత్'


విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న కథానాయకుడు సుమంత్ నటిస్తున్న ఓ వైవిధ్యమైన చిత్రానికి 'ఇదం జగత్' అనే ఆసక్తికరమైన టైటిల్‌ని నిర్ణయించారు. సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా అంజు కురియన్ నాయికగా పరిచయమవుతుంది. విరాట్ ఫిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై అనీల్ శ్రీ కంఠం దర్శకత్వంలో జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేస్తూ  సుమంత్ ఈ చిత్రంలో  కెరీర్‌లో ఇప్పటి వరకు చేయనటువంటి వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయని విభిన్నమైన ఆ పాత్ర ఆడియన్స్‌కు థ్రిల్ల్‌ను కలిగిస్తుందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

Advertisement
CJ Advs

సుమంత్ పాత్ర, కథకు 'ఇదం జగత్' అనే టైటిల్ యాప్ట్‌గా వుంటుంది. టైటిల్‌కు చక్కని స్పందన వస్తోంది. హీరో పాత్ర చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. కొత్తదనం కోరుకునే ఆడియన్స్ కు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది. ఇప్పటి వరకు ఎనభై శాతం షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తున్నాం అని తెలిపారు. శివాజీ రాజా, ఛలో ఫేమ్ సత్య, ప్రియదర్శిని రామ్, ఆదిత్యమీనన్, కళ్యాణ్ విథపు, షఫీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బాల్‌రెడ్డి, ఎడిటింగ్: గ్యారీ బీహెచ్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, కో-ప్రొడ్యూసర్: మురళీకృష్ణ దబ్బుగుడి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అనీల్ శ్రీ కంఠం, నిర్మాతలు: జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్

Sumanth New Film Title is Idam Jagat :

Sumanth Next Film Title Locked 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs