Advertisement
Google Ads BL

'అభిమన్యుడు' కోపం సాంగ్ విడుదలైంది!


'యాంగ్రి బర్డ్‌ లాంటి నన్నె తను లవ్‌ చేసెలేరా..' మాస్‌ హీరో విశాల్‌  'అభిమన్యుడు' పాట విడుదల 

Advertisement
CJ Advs

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'అభిమన్యుడు'. ఎం.పురుషోత్తమన్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై జి.హరి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలోని 'యాంగ్రి బర్డ్‌ లాంటి నన్నె తను లవ్‌ చేసెలేరా..' అంటూ సాగే పాటను సోమవారం విడుదల చేశారు. ఇటీవల యూత్‌స్టార్‌ నితిన్‌ విడుదల చేసిన 'తొలి తొలిగా తొలకరి చూసి పిల్లాడ్నై..' పాటకు చాలా మంచి స్పందన వస్తోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

మాస్‌ హీరో విశాల్‌, సమంత, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌తోపాటు భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: జార్జి సి. విలియమ్స్‌, ఎడిటింగ్‌: రూబెన్‌, ఫైట్స్‌: దిలీప్‌ సుబ్బరాయన్‌, ఆర్ట్‌: ఉమేష్‌ జె.కుమార్‌, మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి, సహ నిర్మాత: ఇ.కె.ప్రకాశ్‌, నిర్మాత: జి.హరి, దర్శకత్వం: పి.ఎస్‌.మిత్రన్‌. 

Angry Bird Song Released From Abhimanyudu :

Vishal and Samantha's Abhimanyudu Film Song Launched
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs