Advertisement
Google Ads BL

'ప్రశ్నిస్తా'నికి వస్తున్నాడు..!


జనం ఎంటర్టైన్మెంట్ పతాకంపై తన కుమారుడైన మనీష్ బాబుని హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాత సత్యారెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'ప్రశ్నిస్తా'. రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారీ హంగులతో అన్నపూర్ణ స్టూడియోస్ లో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో మార్చి 22 న ప్రారంభమైంది. మనీష్ బాబుకి జోడిగా హీరోయిన్ అక్షిత నటిస్తుంది. 

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా నిర్మాత సత్యారెడ్డి మాట్లాడుతూ... గత 20  సంవత్సరాల నుండి తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతగా ఉంటూ అనేక చిత్రాలను నిర్మిస్తున్న మా సంస్థ నుండి మనీష్ బాబుని పరిచయం చేస్తూ ఈ 'ప్రశ్నిస్తా' మూవీని ప్రారంభించడం జరిగింది. 'క్షేమంగా వెళ్లి లాభంగా రండి' వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు రాజా వన్నెంరెడ్డి.. మనీష్ లోని టాలెంట్ ని చూసి తానే మనీష్ ని వెండితెరకు పరిచయం చేస్తానని.. గత రెండేళ్లుగా మనీష్ కి నటనలో శిక్షణ ఇప్పిస్తూ డైలాగ్ దగ్గరనుండి, డాన్స్ లు వంటి వాటిని శిక్షణ ఇప్పించి మరీ మనీష్ ని హీరోగా పరిచయం చేస్తున్నాడు. మనీష్ మీదున్న ప్రేమతో మంచి సబ్జెక్టుని తీసుకుని ఆయనే ఈ సినిమాకి దర్శకత్వం మొదలు పెట్టారు. అలాగే హీరోయిన్ అక్షిత కూడా మన తెలుగమ్మాయి. మరో దివ్య భారతి లాంటి అందంతో.. నటనలో ఈ సినిమాతో అక్షిత మంచి గుర్తింపు తెచ్చుకుంటుందని నమ్మకం వుంది అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన, అలాగే మా బాబు మనీష్ ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను.. అన్నారు. 

దర్శకుడు రాజా వన్నెంరెడ్డి మాట్లాడుతూ- అందరూ సక్సెస్ వెంట పరిగెడుతున్న ఈ రోజుల్లో నిర్మాత సత్యారెడ్డి నన్ను నమ్మి తన కొడుకు మనీష్ బాబుని నాకు అప్పగించారు. నేను మనీష్ బాబుని మంచి హీరోగా తీర్చిదిద్దడానికి కావాల్సిన శిక్షణ ఇప్పించి మరీ ఒక మంచి కథతో... కమర్షియల్ హీరోగా తయారు చెయ్యాలని... నేనే మళ్ళీ నా మొదటి సినిమాని డైరెక్ట్ చేస్తున్నాను అన్నట్టుగా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాను. ఈ సమయంలో మా గురువు గారు దాసరి నారాయణరావు గారు ఉంటే చాలా సంతోష పడేవారు. ఎందుకంటే ఈ సినిమా సబ్జెక్టు ఆయనకు కూడా తెలుసు. ఆయన ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయని ఆశిస్తున్నాను.. అన్నారు.

హీరో మనీష్ బాబు మాట్లాడుతూ- రాజా వన్నెంరెడ్డి గారు మా ఇంట్లో మనిషిగా కలిసిపోయి నా విషయంలో చాలా కేర్ తీసుకుని నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు చాలా సంతోషంగా వుంది. నేను హీరో అవ్వాలన్న నా కోరికను రాజా వన్నెంరెడ్డి గారు గుర్తించి నన్ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు గాను నేను ఎప్పుడూ ఆయనకు రుణపడి ఉంటాను. మంచి కథాంశంతో వస్తున్న ఈ చిత్రం మీ అందరికి నచ్చుతుంది అని నమ్ముతున్నాను. రాజా వన్నెంరెడ్డి గారు చెప్పిన కథని నమ్మి.. నాన్న సత్యారెడ్డి గారు చాలా మంది నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మిస్తామని  చెప్పినా... కాదని ఆయనే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. అన్నారు.

హీరోయిన్ అక్షిత మాట్లాడుతూ- నా టాలెంట్ ని నమ్మి దర్శక నిర్మాతలు నాకు ఈ మూవీ లో నటించే అవకాశమిచ్చారు.. వాళ్లకు నా కృతఙ్ఞతలు.. అన్నారు. 

టెక్నికల్ లిస్ట్: సమర్పణ: బి. శేషుబాబు,  రచయిత: రాజేంద్ర కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సతీష్ రెడ్డి, కో ప్రొడ్యూసర్స్: కె. నారాయణ రెడ్డి, శంకర్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి: యోగి రెడ్డి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు, మ్యూజిక్ డైరెక్టర్: ఎల్. ఎం ప్రేమ్, నిర్మాత: సత్యా రెడ్డి,  డైరెక్టర్: రాజా వన్నెంరెడ్డి.

Prasnistha Movie Launches:

Raja Vannem Reddy New Movie Prasnistha Opening Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs