Advertisement
Google Ads BL

మెగా అభిమానులను ఓపెన్‌ వెల్‌కమ్‌!!


మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ నెల 18న వైజాగ్‌లో 'రంగ‌స్థ‌లం' ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌

Advertisement
CJ Advs

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ , సమంత హీరో హీరోయిన్లుగా సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌, యలమంచిలి రవిశంకర్‌; సి.వి.ఎం(మోహన్‌) నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'రంగస్థలం'. ఈ సినిమా మార్చి 30న విడుదలవుతుంది. మార్చి 18న ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించబోతున్నారు. సినిమాకు సంబంధించిన ఆడియో మార్కెట్లోకి విడుదలైంది. ఈ సందర్భంగా... 

నవీన్‌ ఎర్నేని మాట్లాడుతూ - 'రంగస్థలం' సినిమాకు సంబంధించిన ఆడియో జ్యూక్‌ బాక్స్‌ మార్కెట్లోకి విడుదలైంది. ఆల్‌రెడీ విడుదలైన మూడు పాటలకు చాలా మంచి స్పందన వచ్చింది. ఈ నెల 18న వైజాగ్‌ ఆర్‌.కె.బీచ్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను కండెక్ట్‌ చేస్తున్నాం. ఈ ఈవెంట్‌ను చాలా గ్రాండ్‌గా నిర్వహిస్తున్నాం. వైజాగ్‌ కమీషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ యోగానంద్‌, మున్సిపల్‌ కమీషనర్‌ నారాయణగారి సహకారంతో భారీ ఎత్తున ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను నిర్వహిస్తున్నాం. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ అంతా కంఫర్ట్‌బుల్‌గా జరుగుతుంది. యు.ఎస్‌కు కూడా ముందుగానే ప్రింట్‌ను పంపేస్తున్నాం. ప్రీ రిలీజ్‌కు ముఖ్య అతిథిగా చిరంజీవిగారు రానున్నారు. అభిమానులను ఓపెన్‌ వెల్‌కమ్‌ చెబుతున్నాం.. అన్నారు. 

సుకుమార్‌ మాట్లాడుతూ - ఈరోజు మార్కెట్లోకి 'రంగస్థలం' ఆడియో నేరుగా విడుదలైంది. సినిమాలో ఇప్పటికే 'ఎంత సక్కగున్నావే... ', 'రంగ రంగ రంగస్థలానా..', 'రంగమ్మ మంగమ్మ' అనే మూడు సాంగ్స్‌ విడుదలైయాయి. మరో రెండు సాంగ్స్‌ను జ్యూక్‌ బాక్స్‌లో వినండి. అందులో 'జిగేల్‌ రాణి ఐటెమ్‌ సాంగ్‌ ', 'ఆ గట్టు కుంటావా? ఈ గట్టు కుంటావా?' అనే సాంగ్స్‌ను ఎంజాయ్‌ చేయవచ్చు. అలాగే సినిమాలో సర్‌ప్రైజ్‌ సాంగ్‌ను సినిమాలో చూడొచ్చు. ఆ సాంగ్‌ను చంద్రబోస్‌గారు పాడారు. సినిమాను మార్చి 30న విడుదల చేస్తున్నాం. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సినిమా సాగుతుంది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఆ కాలం నుండి వచ్చిన వ్యక్తులను సినిమా అలరిస్తుంది. మిస్‌ అయిన జనరేషన్‌ను ఈ జనరేషన్‌లో చూడొచ్చు. మంచి టెక్నీషియన్స్‌ దొరకడం వల్ల నా వర్క్‌ సులభమైంది. ముఖ్యంగా ఆర్ట్‌ డైరెక్టర్‌ రామకృష్ణ, మోనికగారు 1980 బ్యాక్‌డ్రాప్‌లో సెట్‌ను చక్కగా చేశారు. నేను పెద్దగా కష్టపడలేదు. తను చాలా అందంగా సెట్‌ వేశాడు. నేను ఆసెట్‌ చూసి ఆశ్చర్యపోయాను. దేవిశ్రీప్రసాద్‌, చంద్రబోస్‌గారు మంచి క్రియేటివ్‌ పర్సన్స్‌. చంద్ర‌బోస్‌గారు ప్రతి సాంగ్‌ను 10-15 నిమిషాల్లో రాసిచ్చేశారు. పాట రాసిన తర్వాతే ట్యూన్స్‌ కంపోజ్‌ చేశారు. సినిమాలో ఆరు పాటలకు ఇదే పద్ధతిని ఫాలో అయ్యాం. నేను 25-28 సంవత్సరాలు పల్లెటూర్లోనే పెరగడంతో మంచి అనుబంధం ఏర్పడింది. ఈ సినిమా చేయడం వల్ల నా అనుబంధాన్ని మళ్లీ వెతుక్కున్నట్లు అయ్యింది. నేను డైరెక్ట్ చేసిన `నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో' సినిమాలు యు.ఎస్‌లో చక్కగా వసూళ్లను రాబట్టాయి. నేను అక్కడకు వెళ్లినప్పుడు ఓకాయన 'మీరు ఆర్బన్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలు చక్కగా చేశారు. మన సంస్కృతిలో సినిమాలు ఎప్పుడు చేస్తారు' అని అడిగారు. నాకే సిగ్గు అనిపించింది. ఇలాంటి సినిమా చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. ఇప్పటికీ కుదిరింది. సినిమాలో రంగమ్మ మంగమ్మ పాటలో ఉపయోగించిన గొల్లభామ అనే పదం ఓ కీటకానికి సంబంధించింది. ఎవరినీ ఎదో అనాలని చేయలేదు. నేను తొలి సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌ పెట్టినప్పుడు అది పెద్ద సక్సెస్‌ అయ్యింది. అక్కడ నుండి ఐటెమ్‌సాంగ్స్‌ కంపల్సరీగా పెట్టాల్సి వస్తుంది. నవీన్‌గారికి కూడా ఐటెమ్‌ సాంగ్స్‌ అంటే ఇష్టం. ఆయనకు ఈ సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌ వినిపించాను. నిర్మాతలకు నచ్చడంతో.. ఐటెమ్‌ సాంగ్‌ను పెట్టాను.. అన్నారు. 

ఆర్ట్‌ డైరెక్టర్‌ రామకృష్ణ మాట్లాడుతూ - నాకు 'రంగస్థలం' సినిమా చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు.. నాకు సహకారం అందించిన రామ్‌చరణ్‌కు థాంక్స్‌. రేపు సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు థ్రిల్‌ అవుతారు. నేను సిటీలోనే పుట్టి పెరగడం వల్ల నాకు విలేజ్‌ కల్చర్‌ తెలియదు. అయినా నేను రీసెర్చ్‌ చేసి సెట్‌ వేశాను. నా కెరీర్‌లో ఇదొక బెస్ట్‌ మూవీగా నిలిచిపోతుంది.. అన్నారు. 

చంద్రబోస్‌ మాట్లాడుతూ.. మంచి సాహిత్యానికి, మంచి సంగీతం కుదిరింది. మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్‌. దాదాపు అందరూ పల్లెటూర్ల నుండి వచ్చారు కాబట్టి వారికి పాటలు బాగా కనెక్ట్‌ అయ్యాయి. పాటలు చాలా బావున్నాయని అందరూ అప్రిసియేట్‌ చేస్తున్నారు.. అన్నారు. 

రామ్‌ చ‌ర‌ణ్‌, స‌మంత‌, జ‌గ‌ప‌తిబాబు, ప్ర‌కాష్ రాజ్‌, సీనియ‌ర్ న‌రేష్‌, ఆది పినిశెట్టి, అన‌సూయ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సంగీతం:  దేవిశ్రీ ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీ:  ర‌త్న‌వేలు, ఎడిటింగ్‌: న‌వీన్ నూలి, సాహిత్యం: చ‌ంద్ర‌బోస్‌, ఆర్ట్‌:  రామ‌కృష్ణ‌,  ఫైట్స్‌:  రామ్‌ల‌క్ష్మ‌ణ్‌, నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్‌, మోహ‌న్‌(సి.వి.ఎం), ద‌ర్శ‌క‌త్వం:  సుకుమార్‌.

Rangasthalam Movie Pre Release Date Announcement:

Rangasthalam Movie Press Meet Updates
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs