Advertisement
Google Ads BL

బెల్లంకొండ శ్రీనివాస్ కి ప్రభాస్ విలన్..!


బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వంశధార క్రియేషన్స్ బ్యానర్ చిత్రంలో కీలకపాత్రలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ 

Advertisement
CJ Advs

ఇప్పటివరకూ స్టార్ డైరెక్టర్లతో కలిసి సినిమాలు చేస్తూ కథానాయకుడిగా తన స్టార్ డమ్ ను పెంచుకొన్న బెల్లంకొండ శ్రీనివాస్ మొదటిసారిగా ఓ కొత్త దర్శకుడైన శ్రీనివాస్ నిర్దేశకత్వంలో వంశధార క్రియేషన్స్ బ్యానర్ పై ఓ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం హైద్రాబాద్ లో మొదటి షెడ్యూల్ జరుపుకొంటున్న ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ముఖ్యపాత్ర పోషించనున్నాడు. 

ఈ సందర్భంగా వంశధార క్రియేషన్స్ అధినేత నవీన్ శొంటీనేని (నాని) మాట్లాడుతూ.. బెల్లంకొండ శ్రీనివాస్ ను సరికొత్తగా ప్రెజంట్ చేయనున్నాం. మంచి థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం శ్రీనివాస్ అద్భుతమైన కథ సిద్ధం చేసుకొన్నాడు. అబ్బూరి రవి, ఛోటా కె.నాయుడు, ఎస్.ఎస్.తమన్, ఛోటా కె.ప్రసాద్, స్టన్ శివ లాంటి సీనియర్ & టాలెంటెడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ కూడా భాగస్వామి అయ్యాడు. ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్ ది విలన్ రోల్ కాదు, కథకి చాలా ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. అతడి పాత్ర స్వభావం, తీరు ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ప్రస్తుతం హైద్రాబాద్ లో మొదటి షెడ్యూల్ జరుగుతోంది. తదుపరి షెడ్యూల్ లో నీల్ నితిన్ ముఖేష్ షూటింగ్ లో పాల్గొంటారు. త్వరలోనే ఈ చిత్రంలో కథానాయికలుగా నటించబోయే ఇద్దరు స్టార్ హీరోయిన్ల పేర్లు కూడా తెలియజేస్తాం.. అన్నారు. 

ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: గణేశుని వెంకటేశ్వర్రావు, కో-డైరెక్టర్: కె.పుల్లారావు, ఫైట్స్: స్టన్ శివ-వెంకట్, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, మాటలు: కేశవ్ పప్పల, ఎడిటర్: ఛోటా కె.ప్రసాద్, ఆర్ట్: చిన్నా, సంగీతం: తమన్.ఎస్, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, నిర్మాణం: వంశధార క్రియేషన్స్, నిర్మాత: నవీన్ శొంటీనేని (నాని), కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీనివాస్. 

Prabhas Villain Now For Bellamkonda!:

Neil Nitin Mukesh For Bellamkonda Sai Srinivas
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs