Advertisement
Google Ads BL

నెల్లూరి పెద్దారెడ్డి రిలీజ్ డేట్ ఫిక్స్..!


ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకొస్తున్న నెల్లూరి పెద్దారెడ్డి...

Advertisement
CJ Advs

సతీష్ రెడ్డి, మౌర్యానీ, ముంతాజ్ హీరో హీరోయిన్లుగా దర్శకుడు వీజే రెడ్డి రూపొందించిన చిత్రం 'నెల్లూరి పెద్దారెడ్డి'. సిద్ధి విఘ్నేశ్వరా క్రియేషన్స్ పతాకంపై సీహెచ్ రఘునాథ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రభాస్ శీను, అంబటి శీను, సమ్మెట గాంధీ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కింది. చిత్ర నేపథ్యం భావోద్వేగాలతో ఉన్నా...కథనం ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. 'నెల్లూరి పెద్దారెడ్డి' చిత్రానికి సెన్సార్ యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'నెల్లూరి పెద్దారెడ్డి' గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ నెల 16న 'నెల్లూరి పెద్దారెడ్డి' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

ఈ సందర్భంగా దర్శకుడు వీజే రెడ్డి మాట్లాడుతూ....'నెల్లూరి పెద్దారెడ్డి' చిత్రానికి సెన్సార్ అభినందనలు దక్కాయి. సెన్సార్ వాళ్లు యూఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ నెల 16న దాదాపు వంద థియేటర్ లలో భారీగా మా చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాం. పల్లె వాతావరణంలో కథంతా సాగుతుంది. పచ్చటి పైరుల అందాలు ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఎక్కడా విసుగు అనిపించకుండా కథనం సాగుతుంది. కథ రీత్యా సెంటిమెంట్ చిత్రమైనా దాన్ని బ్యాలెన్స్ చేసేందుకు కావాల్సినంత వినోదం ఉంటుంది. పాటలు ఇప్పటికే శ్రోతల ఆదరణ పొందుతున్నాయి. నలుగురికి మంచి చేసే పెద్దారెడ్డి ఓ యువతి కుటుంబానికి ఆశ్రయమిస్తాడు. ఈ క్రమంలో అతనికి అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. వాటి పర్యవసానంగా కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది ఆసక్తికరంగా చూపిస్తున్నాం. చింతామణి నాటక రిహార్సల్స్ సన్నివేశాలు ప్రత్యేకంగా రూపొందించాం. ఈ ఎపిసోడ్ అంతా ప్రేక్షకులను బాగా నవ్విస్తుంటుంది.అన్నారు.

కథానాయకుడు సతీష్ రెడ్డి మాట్లాడుతూ.....'నెల్లూరి పెద్దారెడ్డి' అనే పాత్ర పేరు ప్రేక్షకులు వినే ఉంటారు. ఆ పెద్దారెడ్డి నవ్విస్తే....ఈ నెల్లూరి పెద్దారెడ్డి మీకు మర్చిపోలేని అనుభూతిని అందిస్తాడు. ఇంత గొప్ప పాత్రను నాకు ఇచ్చిన దర్శకులు వీజే రెడ్డి గారికి కృతజ్ఞతలు. ప్రణాళిక ప్రకారం కేవలం 28 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశాం. అనుకున్న సమయానికే నిర్మాణాంతర కార్యక్రమాలు ముగించి...ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాం. 16న థియేటర్ లలో మిమ్మల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నాం. అన్నారు. 

'నెల్లూరి పెద్దారెడ్డి' చిత్రానికి మాటలు - సంజీవ్ మేగోటి,  సినిమాటోగ్రఫీ - బాలసుబ్రహ్మణి, ఎడిటింగ్ - మేనగ శీను, సంగీతం - గురురాజ్, డాన్స్ - గోరా మాస్టర్.

Nelluri Pedda Reddy Movie Release Date fix:

Release Date confirmed to Nelluri Pedda Reddy Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs