సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ చేతులమీదుగా 'U -కథే హీరో' మొదటి పాట విడుదల
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ చేతులమీదుగా శ్రీమతి నాగానిక సమర్పణలో కొవెరా క్రియేషన్స్ బ్యానర్ పై నూతన దర్శకుడు కొవెర దర్శకత్వం వహిస్తున్న 'U కథే హీరో' సినిమాలోని మొదటి పాటను విడుదల చేేశారు.
ఈ సందర్భంగా దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. 'ఈ పాట చాలా ఆహ్లాదంగా ఉంది. వినగానే చాలా నచ్చేసింది. ఈ పాటతో పాటుగా ఈ సినిమాలోని అన్ని పాటలు మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ సత్య మహావీర్ కి నా అభినందనలు. అలాగే ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. అన్నారు.
దర్శకుడు కొవెరా మాట్లాడుతూ.. U మొదటి పాట దేవిశ్రీప్రసాద్ గారి చేతులమీదుగా లాంచ్ చెయ్యడం చాలా ఆనందంగా ఉంది. సత్య మహావీర్ మంచి సంగీతాన్ని అందించి మా సినిమాని మరో స్థాయికి చేర్చారు. మిగిలిన పాటలని కూడా తొందరలోనే విడుదల చేస్తాం. నేను V. విజయేంద్ర ప్రసాద్ గారి దగ్గర వర్క్ చేసాను. కొన్ని సినిమాలకి రైటర్ గా కూడా చేసి, మొదటి ప్రయత్నంగా U మూవీని డైరెక్షన్ చేస్తున్నాను.. అని తెలిపారు.
మ్యూజిక్ డైరెక్టర్ సత్య మహావీర్ మాట్లాడుతూ.. దేవి శ్రీ ప్రసాద్ గారి చేతులమీదుగా మా పాట విడుదలవ్వడం చాలా ఆనందంగా ఉంది. 'కాటుకెట్టుకోచ్చిన చందమామ' అనే ఈ పాటని సురేష్ బనిశెట్టి రాశారు. రఘురాం పాడారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల కానున్న ఈ ఆల్బంలో పాటలన్ని కధానుగుణంగా ఉంటాయి.. అన్నారు .
స్క్రీన్ ప్లే రచయిత మధు మాట్లాడుతూ.. ఈ సినిమాకి వర్క్ చెయ్యడం చాలా ఆనందంగా అనిపించింది. అందరూ చెప్పే మాటే అయినా ఈ కధ చాలా కొత్తగా ఉంటుంది. అందుకే 'కథే హీరో' అని క్యాప్షన్ గా పెట్టాం.. అన్నారు.