Advertisement
Google Ads BL

రవితేజ, శ్రీనువైట్ల మూవీలో విశేషాలెన్నో..!


రవితేజ - శ్రీనువైట్ల - మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్లో 'అమర్ అక్బర్ ఆంటోనీ' ప్రారంభం 

Advertisement
CJ Advs

మాస్ మహారాజా రవితేజ, ఎంటర్ టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రస్ లాంటి శ్రీనువైట్లల క్రేజీ కాంబినేషన్ లో 'దుబాయ్ శీను' తర్వాత మళ్లీ కలిసి చేయబోతున్న చిత్రం 'అమర్ అక్బర్ ఆంటోనీ'. రవితేజ సరసన అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.6గా రూపొందుతుండగా.. ఈ చిత్ర ప్రారంభోత్సవం నేడు (మార్చి 8) హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. 

దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు శ్రీనువైట్ల పెద్ద కుమార్తె ఆనంది వైట్ల క్లాప్ కొట్టగా.. రెండవ కుమార్తె ఆద్య వైట్ల కెమెరా స్విచ్చాన్ చేసింది. శ్రీనువైట్ల గౌరవ దర్శకత్వం వహించారు. 

చిత్ర కథానాయకుడు రవితేజ బౌండెడ్ స్క్రిప్ట్ ను దర్శకుడు శ్రీనువైట్లకు అందించారు. 

ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనువైట్ల మాట్లాడుతూ.. నా హీరో రవితేజతో మళ్లీ ఇన్నాళ్ల తర్వాత కలిసి చేయబోతున్న చిత్రం 'అమర్ అక్బర్ ఆంటోనీ'. కథకి బీజం ఏడాది క్రితం పడింది. పది నెలలపాటు కష్టపడి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసాం. రవితేజతో పాటు మా నిర్మాతలకు కూడా కథ బాగా నచ్చింది. షూటింగ్ మొత్తం యునైటెడ్ స్టేట్స్ లొనే చేస్తాం. న్యూయార్క్, డెట్రాయిట్, సాల్ట్ లేక్ సిటీ మరియు ఇతర లొకేషన్స్ లో చిత్రీకరణ జరపనున్నాం. అత్యధిక శాతం అమెరికాలో చిత్రీకరణ జరుపుకోనున్న మొట్టమొదటి చిత్రమిది. కష్టతరమైన ఈ భారీ షెడ్యూల్స్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసిన మా నిర్మాతలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. స్టార్ కమెడియన్ కమ్ హీరో సునీల్ ఈ చిత్రంలో ఫుల్ లెంగ్త్ కామిక్ రోల్ ప్లే చేయనున్నారు. నిన్నటితరం కథానాయకి లయ మరియు ఆమె కుమార్తె శ్లోక కూడా ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించనుండడం విశేషం. ఈ చిత్రంలో రవితేజ తనయుడు మహాధన్ మరో ముఖ్యపాత్ర పోషించనుండడం  'అమర్ అక్బర్ ఆంటోనీ'కి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.. అన్నారు. 

చిత్ర నిర్మాతలు నవీన్ యెర్నేని - వై.రవిశంకర్ - మోహన్ చెరుకూరి మాట్లాడుతూ... మా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకి 'అమర్ అక్బట్ ఆంటోనీ' చాలా స్పెషల్ ప్రాజెక్ట్. టాలీవుడ్ లో ఒన్నాఫ్ ది క్రేజీయస్ట్ కాంబినేషన్ అయిన 'రవితేజ-శ్రీనువైట్ల'లు ఈ చిత్రంతో మళ్లీ కలిసి వర్క్ చేయనుండడం విశేషం. రవితేజ సరసన గ్లామరస్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూట్ త్వరలో ప్రారంభం అవుతుంది. ఎస్.ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు.. అన్నారు. 

RaviTeja and Srinu Vytla Movie Launched:

Raviteja, Sreenu Vytla, Mythri Movie Makers Production No 6 – Amar Akbar Anthony Launched
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs