Advertisement
Google Ads BL

'శీలవతి' టీజర్ వచ్చేసింది..


'జి' స్టూడియోస్ సమర్పణలో సెన్సేషనల్ స్టార్ షకీలా 250 వ చిత్రంగా, రాఘవ ఎమ్ గణేష్ మరియు వీరు బాసింశెట్టి నిర్మాతలుగా, సాయిరామ్ దాసరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'శీలవతి'. కేరళలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్ర టీజర్ ను చిత్ర యూనిట్.. బుధవారం ప్రసాద్ ల్యాబ్ లో  విడుదల చేసింది. 

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా షకీలా మాట్లాడుతూ.. ఈ చిత్రం నాకు చాలా స్పెషల్. నా 250వ చిత్రంలో ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నా. నెక్స్ట్ సీన్ ఏంటి అనేది నటించే నాకు కూడా తెలియకుండా స్క్రీన్ ప్లే ను ప్లాన్ చేసాడు దర్శకుడు. నిర్మాతలిద్దరూ సినిమా కోసం ఏం కావాలన్నా అందించారు. మే లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.. అని తెలిపారు. 

గీతాంజలి (ఫ్రూటీ) మాట్లాడుతూ.. షకీలా గారితో ఇది నా రెండవ చిత్రం. యంగ్ టీమ్ కలసి పని చేసిన సినిమా కనుక చాలా ఫాస్ట్ గా ఇంట్రెస్టింగ్ గా షూటింగ్ పూర్తి అయింది. సినిమా చాలా బాగొచ్చింది.. అందరూ సినిమాను చూసి ఆదరించాలని కోరుతున్నా.. అన్నారు. 

నిర్మాత గణేష్ మాట్లాడుతూ.. మా బ్యానర్ లో వస్తున్న మొదటి సినిమా. షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే లో విడుదల చేయనున్నాము.. అన్నారు. 

మరో నిర్మాత వీరు బాసింశెట్టి మాట్లాడుతూ.. ఇంతకు ముందు రెండు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించినా... సంతృప్తి నిచ్చిన సినిమా మాత్రం శీలవతి. నాకు, షకీలా గారికి మధ్య ఒక నిర్మాత, ఆర్టిస్ట్ లా మొదలైన జర్నీ.. అక్కా.. తమ్ముడు అనుకునేంతగా బంధం ఏర్పడింది. తను చాలా సపోర్ట్ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను.. అన్నారు. 

దర్శకుడు సాయిరామ్ దాసరి మాట్లాడుతూ.. కెమెరామెన్ బెస్ట్ వర్క్ ను ఇచ్చాడు. నిర్మాతలు ఇద్దరూ చాలా మంచి సపోర్ట్ ను అందించారు. ఈ సినిమా చూశాక.. ఇంతకు ముందు షకీలా వేరు ఈ సినిమా తరువాత షకీలా వేరు అని అంటారు... మంచి పేరొస్తుంది తనకు. ఈ చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్ మరియు హార్రర్ కామెడీ జోనర్. తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది.. అన్నారు. 

నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా కృతఙ్ఞతలు. బెస్ట్ వర్క్ ఇచ్చానని అంటున్నారు థాంక్స్... అని తెలిపారు కెమెరామెన్ తరుణ్ కరమ్ తోత్. 

షకీలా, అర్జున్(జబర్దస్త్), గీతాంజలి (ఫ్రూటీ), అశోక్, కొండ, తిరుపతి, చిన్నా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్: ప్రజ్వల్ క్రిష్, డిఓపి: తరుణ్ కరామ్ తోత్, ఎడిటర్స్: శ్రీనివాస రాజలింగు, కె ఆర్. స్వామి, నిర్మాతలు: రాఘవ ఎమ్ మహేష్, వీరు బాసింశెట్టి, కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: సాయిరామ్ దాసరి.

Shakeela Seelavathi Teaser Launched:

Shakeela 250th Movie Seelavathi Movie Latest Updates
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs