Advertisement
Google Ads BL

'హైదరాబాద్ లవ్ స్టోరీ'లో ఉన్న విషయమిదే!

hyderabad love story,rahul ravindran,reshmi menon,raj satya | 'హైదరాబాద్ లవ్ స్టోరీ'లో ఉన్న విషయమిదే!

తెలుగు సినిమాలో లవ్ స్టోరీలు సర్వసాధారణం కానీ ఈ లవ్ స్టోరీ కి ఓ ప్రత్యేకత ఉంది. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ తో హైదరాబాద్ అందాలతో రొమాంటిక్ సన్నివేశాలతో  స్నేహానికి ప్రేమకి మంచి అర్ధం చెప్పే  సినిమా ఈ  'హైదరాబాద్ లవ్ స్టొరీ'. రాహుల్ రవీంద్రన్, రేష్మీ మీనన్ మరియు జియ హీరో హీరోయిన్లుగా రాజ్ సత్య దర్శకత్వంలో ఏం.ఏల్. రాజు, ఆర్.ఏస్ కిషన్, వేణు గోపాల్ కొదుమగుళ్ళ సంయుక్తంగా ‘సినిమా పీపుల్’  పతాకంపై నిర్మించబడుతున్న సినిమా 'హైదరాబాద్ లవ్ స్టొరీ'.

Advertisement
CJ Advs

ఈ చిత్రం భారీ అంచనాలతో ఈ నెల అంటే ఫిబ్రవరి 23 న బ్రహ్మాండమైన విడుదల.

ఈ సందర్భంగా దర్శకులు రాజ్ సత్య మాట్లాడుతూ.. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో హైదరాబాద్ అందాలతో మంచి ఫీల్ గుడ్ సన్నివేశాలతో ప్రేమకి స్నేహానికి మంచి అర్ధం చెప్పే సినిమా. యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ తప్పక చూడదగ్గ చిత్రం హైదరాబాద్ లవ్ స్టొరీ. సునీల్ కశ్యప్ మంచి సంగీతం అందించారు. పాటలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి అలాగే సినిమా కూడా అందరికి నచ్చుతుంది. నిర్మాతలు ఏం.ఏల్ రాజు, ఆర్.ఏస్ కిషన్, వేణు గోపాల్ కొదుమగుళ్ళ రాజీ పడకుండా నిర్మించారు. ఈ నెల 23 న విడుదలవుతుంది.. అన్నారు.  

నిర్మాతలు మాట్లాడుతూ.. సినిమా చాలా బాగా వచ్చింది. రాజ్ సత్య అద్భుతంగా చిత్రీకరించారు. రాహుల్ రవీంద్రన్ నటన, హీరోయిన్ల గ్లామర్, సునీల్ కశ్యప్ సంగీతం, రావు రమేష్ గారి నటన మా చిత్రానికి మంచి హైలైట్ గా నిలుస్తుంది. ఈ నెల 23న అత్యధిక థియేటర్స్ లో విడుదల చేస్తున్నాము. తెలుగు ప్రేక్షకులకు నచ్చే సినిమా మా 'హైదరాబాద్ లవ్ స్టొరీ'. 

రాహుల్ రవీంద్రన్, రేష్మీ మీనన్,  జియా, రావు రమేష్, అంబటి, రమాప్రభ, షఫీ, సన, సూర్య, రచ్చ రవి తదితరులు నటించిన ఈ చిత్రానికి బ్యానర్: సినిమా పీపుల్, సమర్పణ: మాస్టర్ ప్రణవ్ తేజ్, కెమెరా మన్ : బి వీ అమర్నాథ్ రెడ్డి, ఎడిటర్: ఎం ఆర్ వర్మ, మ్యూజిక్: సునీల్ కశ్యప్, ప్రొడ్యూసర్స్: ఏం.ఏల్ రాజు, ఆర్.ఏస్ కిషన్, వేణు గోపాల్ కొదుమగుళ్ళ, కథ, డైలాగ్స్ , స్క్రీన్ ప్లే , దర్శకత్వం: రాజ్ సత్య

Hyderabad Love Story Movie Release Details:

Hyderabad Love Story Movie Released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs