Advertisement
Google Ads BL

నారా రోహిత్ మరో కొత్త డైరెక్టర్ తో..!!


నారా రోహిత్ హీరోగా ఎస్.డి.చక్రవర్తి దర్శకత్వంలో ఈ.ఎం.వి.ఈ స్టూడియోస్ ప్రొడక్షన్ నెం.3  

Advertisement
CJ Advs

రొటీన్ కు భిన్నంగా వైవిధ్యమైన కథ-కథనాలను ఎంచుకుంటూ కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకొన్న నారా రోహిత్ తాజాగా ఈ.ఎం.వి.ఈ స్టూడియోస్ సంస్థలో సినిమా సైన్ చేశాడు. ప్రొడక్షన్ నెం.3గా ఈ.ఎం.వి.ఈ స్టూడియోస్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం ద్వారా ఎస్.డి.చక్రవర్తి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వైవిధ్యమైన కథతో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చి నుంచి మొదలవ్వనుంది. వడ్డేవల్లి సత్యనారాయణ సమర్పణలో రూపొందనున్న ఈ చిత్రంలో నారా రోహిత్ క్యారెక్టరైజేషన్, గెటప్ చాలా టిపికల్ గా ఉండబోతున్నాయి. 

ప్రస్తుతం తమ ప్రొడక్షన్ లో రూపొందిన 'హౌరా బ్రిడ్జ్' విడుదలలో బిజీగా ఉన్న నిర్మాణ బృందం.. సినిమా రిలీజవ్వగానే నారా రోహిత్ సినిమాకి సంబంధించిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నారు.  

ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, సమర్పణ: వడ్డేవల్లి సత్యనారాయణ, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఎస్.డి.చక్రవర్తి. నిర్మాణం: ఈ.ఎం.వి.ఈ స్టూడియోస్.

Nara Rohit Movie with Debut Director:

Nara Rohit in SD Chakravarthy Direction
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs