Advertisement
Google Ads BL

అతి త్వరలో 'ట‌చ్ చేసి చూడు'..!


మాస్ మహారాజా రవితేజ హీరోగా న‌టించిన‌ 'టచ్ చేసి చూడు' చిత్రాన్నిఅతి  త్వరలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.  బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్ర‌మిది. ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా ప‌నిచేసిన  విక్రమ్ సిరికొండ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. రాశీఖ‌న్నా, సీర‌త్ క‌పూర్ నాయిక‌లు.

Advertisement
CJ Advs

నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ మాట్లాడుతూ.. అతి త్వరలో మా `ట‌చ్ చేసి చూడు` చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. ఈ వారంలో  ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తాం. అన్ని కార్య‌క్ర‌మాలు దాదాపుగా పూర్తి కావ‌చ్చాయి. మా సినిమాలోని ఒక్కో పాట‌ను సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేస్తున్నాం. ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. ర‌వితేజ చాలా స్టైలిష్‌గా క‌నిపిస్తున్నార‌ని సర్వ‌త్రా అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు. మాకు చిరకాల మిత్రుడైన రవితేజతో ఈ సినిమా నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మాస్ మహారాజా ఇమేజ్ కి తగ్గట్టుగా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అద్భుతమైన కథను తయారు చేశారు. చూసిన ప్ర‌తి ఒక్క‌రికీ త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది...అని తెలిపారు.

ఈ చిత్రానికి సంగీతం : జామ్ 8, కథ : వక్కంతం వంశీ, స్క్రీన్ ప్లే : దీపక్ రాజ్, మాటలు : శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ డైలాగ్స్: రవిరెడ్డి మల్లు,కేశవ్ , ఎడిటింగ్ : గౌతం రాజు, ఆర్ట్: రమణ,  ఛాయాగ్రహణం :  చోటా.కె.నాయుడు,  నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ, స్క్రీన్ ప్లే ,దర్శకత్వం : విక్రమ్ సిరికొండ.

Touch Chesi Choodu Ready to Release:

Raviteja Touch Chesi Choodu Latest Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs