Advertisement
Google Ads BL

ఈ అబ్బాయిలో మంచి లక్షణాలే ఉన్నాయ్!!


నందమూరి కళ్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా, నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌ 'MLA'. 'మంచి లక్షణాలున్న అబ్బాయ్' అనేది కాప్షన్. ఈ చిత్రంలో అందాల భామ కాజల్ హీరోయిన్ గా నటిస్తున్నారు.  

Advertisement
CJ Advs

T.G. విశ్వప్రసాద్ సమర్పణ లో, బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ LLP మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ LLP బ్యానర్ ల సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, వచ్చే నెల ఫారిన్ షెడ్యూల్ లో పాటల చిత్రీకరణ తో షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసుకుంటుంది. 

'ఆద్యంతం వినోదభరితంగా సాగే ఈ చిత్రం హీరో కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఒక మంచి చిత్రం అవుతుంది అని నమ్ముతున్నాం. నూతన దర్శకుడు ఉపేంద్ర ఈ చిత్రాన్ని చాలా వినోదభరితంగా మలచారు.  మార్చిలో వేసవి సెలవుల సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్రం టీజర్ ను భోగి రోజు విడుదల చేయగా, విశేష స్పందన లభించింది'.. అని నిర్మాతలు తెలిపారు. 

టోటల్ న్యూ లుక్ లో ఎంతో స్టైలిష్ గా కళ్యాణ్ రామ్ గారు ఈ సినిమా లో కనపడతారు. నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ గారికి, చిత్ర నిర్మాతలకి కృతజ్ఞతలు తెలుపుతున్నా. MLA అనే టైటిల్ కి, కాప్షన్ కి పూర్తి జస్టిఫికేషన్ ఉంటుంది.. అని దర్శకులు ఉపేంద్ర అన్నారు. 

రవి కిషెన్, పోసాని , జయప్రకాశ్ రెడ్డి, అజయ్, వెన్నెల కిశోర్, పృథ్వి, శివాజీ రాజా, ప్రభాస్ శ్రీను, లాస్యా , మనాలి రాథోడ్ ఈ చిత్రంలోని ప్రధాన నటులు. 

Click Here For MLA Teaser

MLA Teaser Released:

Nandamuri Kalyan Ram MLA Mini Teaser Released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs