Advertisement
Google Ads BL

'లక్కీఫెలో' జయ బి. కి.. హ్యాపీ బర్త్ డే..!


కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందించే 'లక్కీఫెలో' సినిమా 'లవ్‌లీ' కంటే పెద్ద హిట్‌ అవుతుంది - డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. 

Advertisement
CJ Advs

జర్నలిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించి రచయిత్రిగా, 'సూపర్‌హిట్‌' పత్రిక జనరల్‌ మేనేజర్‌గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న జయ బి, సినిమాల మీద మక్కువతో 'చంటిగాడు' చిత్రంతో దర్శకురాలిగా మారి 'గుండమ్మగారి మనవడు', 'లవ్‌లీ', 'వైశాఖం' లాంటి ఫీల్‌గుడ్‌ మూవీస్‌ని ప్రేక్షకులకందించి దర్శకురాలిగా తనకంటూ ఓ స్పెషల్‌ ఇమేజ్‌ని తెచ్చుకున్నారు డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. 'వైశాఖం' చిత్రంతో ప్రేక్షకుల ప్రశంసలతో పాటు సిల్వర్‌ క్రౌన్‌ అవార్డ్‌ పొందిన జయ బి. పుట్టినరోజు జనవరి 11. ఈ సందర్భంగా జనవరి 10న హైదరాబాద్‌ దసపల్లా హోటల్‌లో ప్రెస్‌మీట్‌ని ఏర్పాటు చేశారు. 

'లక్కీఫెలో' జూన్‌లో ప్రారంభం!! 

డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. మాట్లాడుతూ - 'వైశాఖం' చిత్రం పూర్తిగా నాకు సంతృప్తిని కలిగించింది. ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరించి పెద్ద హిట్‌ చేశారు. చాలామంది 'సినిమా చాలా బాగుంది.. మంచి సినిమా తీశారు' అని అప్రిషియేట్‌ చేశారు. నెక్స్‌ట్‌ మా ఆర్‌.జె. సినిమాస్‌ బేనర్‌లో 'లక్కీఫెలో' చిత్రాన్ని రూపొందిస్తున్నాం. జూన్‌లో సినిమా స్టార్ట్‌ చేసి మూడు నాలుగు నెలల్లో షూటింగ్‌ కంప్లీట్‌ చేస్తాం. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. ఓ యంగ్‌ హీరో ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఆ హీరో ఎవరనేది త్వరలోనే ఎనౌన్స్‌ చేస్తాం. జనరల్‌గా కొంతమందికి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా, విచిత్రంగా ఒక ఛాన్స్‌ వస్తుంది. అది రాగానే అందరూ వాడు 'లక్కీఫెలో'రా అని చెప్తారు. అతను ఆ ఛాన్స్‌ కోసం ట్రై చేయకపోయినా గొప్ప ఛాన్స్‌ వస్తుంది. అది చాలా రేర్‌గా జరుగుతుంది. అది హీరో క్యారెక్టరైజేషన్‌. ఆ ఛాన్స్‌ని హీరో ఎలా తీసుకుంటాడు? మిస్‌ యూజ్‌ చేసుకుంటాడా? ఇంకా హైట్స్‌కి వెళ్తాడా? అనేది కాన్సెప్ట్‌. హ్యూమన్‌ సైకాలజీని బేస్‌ చేసుకుని సబ్జెక్ట్‌ రెడీ చేస్తున్నాం. 

హీరోయిన్‌ క్యారెక్టర్‌ చాలా స్ట్రాంగ్‌!! 

అలాగే హీరోతో పాటు హీరోయిన్‌ది చాలా స్ట్రాంగ్‌ క్యారెక్టర్‌ వుంటుంది. మన సమాజంలో ఆడవాళ్లకి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అవి మానసికంగా చాలా అల్లకల్లోలం చేస్తుంటాయి. ఆ పాయింట్‌ ఇంతవరకూ ఎవరూ టచ్‌ చేయలేదు. జనరల్‌గా టెన్త్‌, ఇంటర్మీడియెట్‌, డిగ్రీ చదివే అమ్మాయిలు బస్సుల్లో ప్రయాణించేటప్పుడు మగవాళ్ళు కావాలని కొంతమంది, అనుకోకుండా కొంతమంది అమ్మాయిల్ని టచ్‌ చేస్తారు. ఆ టైమ్‌లో అమ్మాయిలు చాలా ఎలర్జీకి గురవుతారు. ఆ టచ్‌ వాళ్లని చాలాకాలం వెంటాడుతుంది. ఇలాంటి కొన్ని సెన్సిటివ్‌ అంశాలని హీరోయిన్‌ డీల్‌ చేస్తుంది. పాటలకి, రొమాన్స్‌కే కాకుండా హీరోయిన్‌ క్యారెక్టర్‌కి ఓ పర్పస్‌ వుండాలని ట్రై చేస్తున్నాం. ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ వుంటూనే అండర్‌ కరెంట్‌లో కొంత మెస్సేజ్‌ వుంటుంది. నా ఫస్ట్‌ సినిమా 'చంటిగాడు' నుండి 'వైశాఖం' వరకు ఎంటర్‌టైన్‌మెంట్‌ని మిస్‌ కాలేదు. బేసిగ్గా నేను ఎంటర్‌టైన్‌మెంట్‌ అంటే బాగా ఇష్టపడ్తాను. అలాగే ఎంటర్‌టైన్‌మెంట్‌తోనే సినిమాలు తీస్తాను. 

ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చెయ్యాలి!! 

'వైశాఖం' మేము ఎంత ఎక్స్‌పెక్ట్‌ చేశామో అంత కమర్షియల్‌గా సక్సెస్‌ అయ్యింది. మా పరిధి మేరకు ఆ చిత్రం మాకు చాలా హ్యాపీ. ఎక్కడికెళ్ళినా అప్రిషియేట్‌ చేస్తున్నారు. సిల్వర్‌ క్రౌన్‌ అవార్డు వచ్చింది. 'లవ్‌లీ' సినిమాకి కమర్షియల్‌గా సక్సెస్‌తో పాటు మంచి అప్రిషియేషన్స్‌ లభించాయి. 'లక్కీఫెలో' సినిమా 'లవ్‌లీ' కంటే చాలా పెద్ద హిట్‌ అవుతుంది. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ అన్నీ ఈ చిత్రంలో వున్నాయి. టైటిల్‌ చాలా బాగుందని చాలామంది అంటున్నారు. వైవిధ్యభరితమైన మంచి సినిమాలు ఇంకా ఎన్నో తీసి ప్రేక్షకులను మెస్మరైజ్‌ చెయ్యాలని వుంది. అలాగే జయ మార్క్‌ ఫిలిం చెయ్యాలని వుంది. దాని తర్వాత జనంలోకి వెళ్ళి జనంతో మమేకమై సేవ చెయ్యాలని వుంది. 

మహిళా దర్శకుల సంఖ్య పెరగాలి!! 

విజయవాడ లబ్బీపేట 'ఆంధ్రజ్యోతి' మెయిన్‌ ఆఫీస్‌ వున్నప్పుడు లేడీ జర్నలిస్ట్‌ నేను ఒక్కదాన్నే వుండేదాన్ని. ఈనాడు రామోజీ జర్నలిజం స్కూల్‌కి ప్రొఫెసర్‌గా విజిటింగ్‌కి వెళ్లినప్పుడు అక్కడ చాలామంది అమ్మాయిలు నన్ను చూసి ఇన్‌స్పైర్‌ అయ్యారు. ఇవాళ ఎంతోమంది మహిళా జర్నలిస్ట్‌లు వున్నారు. అలాగే ఇండస్ట్రీలో కూడా మహిళా దర్శకులు ఇద్దరు, ముగ్గురే వున్నారు. ఇంకా ఎంతోమంది ఇన్‌స్పైర్‌ అయి మంచి సినిమాలు తీయాలి. మహిళా దర్శకుల సంఖ్య మరింత పెరగాలి. వారందరికీ నా స్వాగతం. వెబ్‌సిరీస్‌ చేసే ఆలోచన లేదు. నా ఫోకస్‌ అంతా సినిమాలమీదే. సినిమాకి వున్నంత క్రేజ్‌ వెబ్‌ సిరీస్‌కి వుండదు. ఇప్పటికీ మా 'చంటిగాడు', 'లవ్‌లీ', 'వైశాఖం' చిత్రాల గురించి మాట్లాడుకుంటారు అంటే సినిమాకి వున్న పవర్‌ అది.. అన్నారు. 

జనవరి 11 డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. పుట్టినరోజు. ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది సినీజోష్. 

Happy Birthday To Lucky Fellow B Jaya:

B Jaya Next Movie Title is Lucky Fellow
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs