Advertisement
Google Ads BL

మా మంచి 'రాజు'గారికి జన్మదిన శుభాకాంక్షలు!


ఒక కుటుంబం సక్రమంగా నడవాలంటే.. ఆ కుటుంబ పెద్ద బాధ్యత గట్టిగా ఉండాలి. ఇది నా కుటుంబం అనుకోవాలి. ఈ కుటుంబంలోని వారంతా నా వాళ్ళు అని కలుపుకుని పోగలిగే సత్తా ఉండాలి. కుటుంబమే కాదు. అది ఏ వ్యవస్థ అయినా, ఏ రంగమైనా ఇది ముఖ్యంగా ఉండాలి. సినీ మీడియా అనే కుటుంబంలో ఆ సత్తా కలిగిన ఏకైక వ్యక్తి 'బి.ఎ.రాజు'. సినీ మీడియాకి పెద్ద దిక్కు, సినీ మీడియా 'కింగ్'.. ఇంకా చెప్పాలంటే సినీ మీడియాకి ఆయనే 'బాహుబలి'. సినీ పీఆర్వోగా ఆయన చేసిన సినిమాల లెక్క చాలు.. శాసించడానికి. ఆపదలో ఉన్నామంటే.. కరిగిపోయే మనసు చాలు ప్రేమించడానికి. మనలో ఒకడిగా కలిసిపోయి.. అందరినీ పేరు పేరునా గుర్తుపెట్టుకుని పలకరించే వెన్నలాంటి మనసు ఎందరికి ఉంటుంది. ఎంత కష్టం అయినా పెదవిపై చెరగని చిరునవ్వుని కురిపించడం ఎంతమందికి సాధ్యం. 'బి.ఎ.రాజు' మన సినిమా చూస్తున్నాడు చాలు అని ధైర్యంగా ఉండే నిర్మాతలని, రాజు గారా.. అయితే మా సినిమా హిట్టే అని భావించే హీరోలని, రాజు గారిదా.. అయితే వెళ్లాల్సిందే అని ఎంత దూరంలో మీడియా సమావేశం జరిగినా వెళ్లే తన తోటి మీడియా సోదరులని.. ఎవరిని కదిలించినా ఆయన గురించి చెప్పే ఒకే ఒక్క మాట 'మా మంచి రాజు'. నిర్మాతగానూ సక్సెస్ పథంలో దూసుకెళుతున్నరాజుగారి పుట్టినరోజు జనవరి 7. 

Advertisement
CJ Advs

ఇలాగే ఆయన మరెన్నో ఉన్నత శిఖరాలను అందుకోవాలని, నిర్మాతగా మరెన్నో మంచి చిత్రాలను నిర్మించాలని, ఆయురారోగ్యాలతో మరెన్నో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మా మంచి 'రాజు'గారికి సినీజోష్ చెబుతుంది జన్మదిన శుభాకాంక్షలు. 

Birthday Wishes to BA Raju:

Happy Birthday to Media King BA Raju
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs