Advertisement
Google Ads BL

ఫస్ట్ ఇంపాక్ట్ తో డబుల్ బొనాంజా..!


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వక్కంతం వంశీ,  'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' ఫస్ట్ ఇంపాక్ట్ కి ప్రశంశ‌ల జ‌ల్లు 

Advertisement
CJ Advs

స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్, అను ఇమ్మాన్యూయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ  తెరకెక్కుతున్న చిత్రం 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా'.  కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో   యాక్షన్ కింగ్ అర్జున్, శ‌ర‌త్ కుమార్ లు ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది.ఈ చిత్రానికి సంబందించిన ఫ‌స్ట్ ఇంపాక్ట్ జ‌న‌వ‌రి 1న విడుదల చేశారు. ఈ టీజ‌ర్ చూసిన వారంతా అల్లు అర్జున్ డెడికేష‌న్ గురించి, మేక్ ఓవ‌ర్ గురించి మాట్లాడుకుంటున్నారు. నీకు సూర్య సోల్జ‌ర్‌.. కాని  ప్ర‌పంచానికి సూర్య అంటే యాంగర్‌..... అనే ఇంట్రో తో స్టార్ట‌యిన ఈ ఇంపాక్ట్ నిజంగానే అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు ఇంపాక్ట్ క‌లిగించింది. టైటిల్ కి త‌గ్గ‌ట్టుగా అల్లు అర్జున్ పాత్రని పాత్రలో లీన‌మైపోయిన న‌టించిన న‌ట‌న టీజ‌ర్ లో ఆక‌ట్టుకుంది. ఏ ముహుర్తాన మొట్టమొదటి సారిగా ఫ‌స్ట్ ఇంపాక్ట్ అన్నారో గాని ఈ విజువ‌ల్స్ అంత‌లా ఇంపాక్ట్ క‌లిగించాయి. ఈ ఇంపాక్ట్ చూస్తే అల్లు అర్జున్ డెడికేష‌న్, ద‌ర్శ‌కుడు ప‌నితీరు, కెమెరామెన్ విజువ‌ల్స్ తో పాటు డైలాగ్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. చ‌చ్చిపోతాను కాని ఇక్క‌డ కాదు బోర్డ‌ర్ లో చ‌చ్చిపోతాను అనే డైలాగ్ రోమాలు నిక్క‌బొడుచుకునేలా వుందంటున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి సినిమాను 2018, ఏప్రిల్ 27న విడుదల చేస్తున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ - శేఖర్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు. 

ఈ సంద‌ర్బంగా నిర్మాత శిరీషా శ్రీధ‌ర్ మాట్లాడుతూ.. స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న భారీ చిత్రం 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా'. అత్యంత భారీ తారాగణం, సాంకేతిక నిపుణుల‌తో చిత్రాన్ని ఎక్కడా కాంప్ర‌మైజ్ కాకుండా తెర‌కెక్కించామ‌నేది మా ఫ‌స్ట్ ఇంపాక్ట్ చూసిన వారంతా చెబుతున్నారు. బన్నీగారి డెడికేష‌న్‌, ద‌ర్శ‌కుడు విజ‌న్ క‌లిస్తే మా ఫ‌స్ట్ ఇంపాక్ట్.. ఇదే రేంజ్ లో చిత్రం వుండ‌బోతుంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి 2018 ఏప్రిల్ 27న విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నాము. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం స‌మ్మ‌ర్ కానుక‌గా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. ముఖ్యంగా ఫ‌స్ట్ ఇంపాక్ట్ లో డైలాగ్స్ గురించి మాట్లాడుకోవ‌టం ఆనందంగా వుంది.. అని అన్నారు

చిత్ర సమర్పకుడు నాగబాబు మాట్లాడుతూ.. బన్నీ కెరీర్ లో హైవోల్టేజ్ యాక్షన్ లవ్ ఎంటర్టైనర్ గా దర్శకుడు వక్కంతం వంశీ అద్భుతమైన కథ కథనంతో కంప్లీట్ ప్యాకేజీ అందిస్తున్నాడ‌నేదానికి ఉదాహర‌ణ మా ఫ‌స్ట్ ఇంపాక్ట్‌.  హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ఏప్రిల్ 27, 2018 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. ఫస్ట్ ఇంపాక్ట్ తో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తప్పకుండా అద్బుతమైన స‌మ్మ‌ర్ గిఫ్ట్ అవుతుంది.. అని అన్నారు.

సహ నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఏప్రిల్ 27, 2018 పెద్ద పండగ చేసుకునే రోజు. ఆ రోజు అత్యధిక థియేటర్స్ లో ప్రపంచ వ్యాప్తంగా నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా విడుదల చేస్తున్నాం. దానికంటే ఈరోజు విడుద‌ల చేసిన ఫ‌స్ట్‌ ఇంపాక్ట్  న్యూ ఇయర్ గిఫ్ట్ తో డబుల్ బొనాంజాగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. వక్కంతం వంశీ ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ సినిమా రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ తో చాలా హ్యాపీగా ఉన్నాం. మరో కీలకమైన షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది. యాక్షన్ సన్నివేశాలతో పాటు కొన్ని సీన్స్ చిత్రీకరిస్తున్నాం.. అని అన్నారు.

Producers Happy with Naa Peru Surya Naa Illu India First Impact Response:

Producers About Naa Peru Surya Naa Illu India First Impact
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs